మాన్సాస్ మీద మరింత దూకుడు... ?

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలలో తాజాగా సరి కొత్త కోణం చోటు చేసుకుంది. ఇప్పటిదాకా మాటల తూటాలు ఆ వైపూ ఈ వైపు నుంచి పేలాయి. ఇపుడు మాత్రం అసలైన కధ సాగనుంది. విశాఖలోని ప్రఖ్యాత దేవాలయం సింహాచలం ఆలయ భూముల అక్రమాలతో పాటు, మాన్సాస్ట్ ట్రస్ట్ వ్యవహారాల మీద లోతైన విచారాణకు ప్రభుత్వం ఆదేశించింది.

దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధం ఆద్వర్యంలో ఈ విచారణ జరగనుంది. దాంతో సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ ఈవోలు విచారణకు సహకరించాలని కోరుతూ ఆదేశాలు వెళ్ళాయి. 

ఈ సమగ్ర విచారణను పదిరోజులలో పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ మీదట నివేదకలో వెలుగు చూసే అంశాల బట్టి చర్యలు ఉంటాయని అంటున్నారు.

మొత్తానికి మాన్సాస్ విషయంలో ఇంతకాలం మాటలకే పరిమితం అయిన ప్రభుత్వ వర్గాలు ఇపుడు చేతలకు ఉపక్రమించాయని తెలుస్తోంది. మరి మిగిలిన కధా కమామీష్ రాజకీయ వెండి తెర మీద చూడాల్సిందే. 

ఇప్పటికే సింహాచలం భూములు 748 దాకా తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే మాన్సాస్ భూముల విషయంలోనూ ఇవే రకమైన ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తాయా. వేచి చూడాలి మరి.

Show comments