ఎమ్మెల్యే రేటు ఐదు కోట్లా.. అంతకు మించా!

కర్ణాటకలో ఎమ్మెల్యే రేటు ఎంతనే అంశం ఆసక్తిదాయకంగా మారింది. అక్కడ సాగుతున్న రాజకీయం ఏమిటో అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల బేరసారాలు గట్టిగానే సాగుతూ ఉన్నాయని స్పష్టం అవుతోంది. 

ఈ విషయంలో ఒక పార్టీని నిందించేది ఏమీలేదు. ఇరువర్గాలూ పోటాపోటీగా బేరసారాలు సాగిస్తున్నాయని స్పష్టం అవుతోంది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒకరు, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మరొకరు ఎమ్మెల్యేలకు రేట్లు కడుతూ ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పటికే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కారుకు దూరం అయ్యారు. వారంతా తమ అసంతృప్తి ఎందుకో పైకి చెప్పడంలేదు. వారి గురించి రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. వారంతా అమ్ముడు పోయారని అంటున్నారు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు.

అదే సమయంలో వారికి సర్ధి చెప్పడానికి, వారితో కాంప్రమైజ్ కావడానికి వీళ్లు కూడా గట్టిగానే ప్రయత్నించారు. వారికి ఏం కావాలో అడిగి అందించడానికి ఓకే చెప్పారు కూడా. అయితే ఎందుకో డీల్ కుదరలేదు.
ఇక మరోవైపు తనకు ఐదుకోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారని, తిరుగుబాటు చేయాలని జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. తనకు డబ్బులు ఆఫర్ చేసిన బీజేపీ నేతల పేర్లను కూడా 
ఆయన చెప్పడం గమనార్హం!

తనకు కట్టిన విలువ అయితే ఐదుకోట్ల రూపాయలు అని ఆయన చెప్పారు. అయినా తను లొంగలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఐదుకోట్ల రూపాయలకు లొంగలేదని చెప్పిన ఆయన అంతకుమించి అడుగుతున్నారా? అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కర్ణాటక రచ్చలో ఏడాది నుంచి ఎమ్మెల్యేలకు భారీ రేటు పలుకుతోందని.. ఐదుకోట్ల రూపాయల మొత్తం చిన్నదని, అక్కడ ఎమ్మెల్యేల రేటు అంతకు మించి ఉందని మాత్రం రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..