రిటర్న్ గిఫ్ట్ కోరుతున్న మంత్రి?

వైసీపీలో బహుమతులు నజరానాలు ఉండవు, ఆ కల్చర్ కి అధినాయకత్వం పూర్తిగా వ్యతిరేకం. మరి అన్నీ తెలిసి వైసీపీ మంత్రి తనకు బహుమతి కావాలని బాహాటంగానే అడుగుతున్నారంటే విశేషమే.

అంతే కాదు ఆయన సొంత క్యాడర్ నుంచే ఆ బహుమతిని కోరుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే తాను గత ఇరవై నెలలుగా చేసిన సేవలకు గాను కార్యకర్తలు మంచి బహుమతి ఇవ్వాలని మంత్రి సీదరి అప్పలరాజు కోరుతున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సర్పంచులను గెలిపించి బహుమతి ఇవ్వాలని ఆయన క్యాడర్ కి ఇలా విన్నపం చేసుకున్నారు.

ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామ సీమలు బాగుపడ్డాయని ఆయన చెబుతూనే వైసీపీని ఆదరించే వారు గ్రామ సారధ్యం వహిస్తే ప్రగతి మరింతగా ముందుకు సాగుతుంది అంటున్నారు. మొత్తానికి మంత్రి గారు రిటర్న్ గిఫ్ట్ ఆశిస్తున్నారు అన్న మాట.

థియేటర్లకు ఇంకా కష్టం

జ‌గ‌న్ పార్టీ ఉనికిని కాపాడింది ష‌ర్మిలే

Show comments