మెగాభిమానులకు వరుస ఈవెంట్లు

కొద్దిరోజుల క్రితమే మెగాఫ్యాన్స్ అంతా కలిసి మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. శిల్పకళావేదికలో పవర్ స్టార్ సాక్షిగా ఈ ఫంక్షన్ భారీగా జరిగింది. మళ్లీ మరోసారి ఫంక్షన్ కాకపోయినా, ఆ రేంజ్ లో జరగబోతోంది సైరా ట్రయిలర్ లాంచింగ్. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో సైరా ట్రయిలర్ ను అభిమానుల కోసం ప్రదర్శించబోతున్నారు. ఈసాయంత్రం అయిదున్నరకు ఈ కార్యక్రమం వుంటుంది.

సైరా నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ ట్రయిలర్ ప్రదర్శన కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మామూలుగానే ట్రయిలర్ లాంచ్ అంటే అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో వుంటుంది. దానికితోడు రామ్ చరణ్ వస్తున్నారు అంటే మరో లెవెల్ లో వుంటుంది.

అభిమానుల కోసం సుదర్శన్ 70 ఎమ్ ఎమ్ ను వెన్యూగా ఫిక్స్ చేసారు. మీడియా కోసం ప్రసాద్ బిగ్ స్క్రీన్ ను ఎంపిక చేసారు. ఈ రెండుచోట్లా ఒకేసారి ట్రయిలర్ ప్రదర్శన వుంటుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు ఈవెంట్లు జరిగాక, మెగాభిమానులు మరోసారి ఈనెల 22న ప్రీరిలీజ్ ఫంక్షన్ రెడీ కావచ్చు. టోటల్ గా అతి కొద్ది గ్యాప్ లో మెగాభిమానుల కోసం మూడు ఈవెంట్లు అన్నమాట.

మారని చంద్రబాబు నాయుడు తీరు

Show comments