'మన' మీడియా మళ్లీ మడి కట్టుకుంది

హమ్మయ్య ఎన్నికలు అయిపోయాయి. మళ్లీ అయదేళ్ల వరకు మీడియా బట్టలు విప్పే పనిలేదు. బుద్దిగా మడి కట్టుకుని ప్రజల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద దృష్టి పెట్టొచ్చు. దాదాపు ముఫై నలభై ఏళ్లుగా ఇదే పని. ఎన్నికలు రావడం భయం, బట్టలు విప్పేయడమే. నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీని మించిన పార్టీ లేదు. ఆ పార్టీ మిత్రులంత మంచి వాళ్లులేరు. బాబు మాత్రమే అధికారంలోకి రావడానికి అర్హుడు. మిగిలిన ఎవరైనా అనర్హులే. ఆంధ్రదేశం వున్నంతకాలం, తెలుగుదేశం పార్టీ, ఆ సామాజిక వర్గమే రాష్ట్రాన్ని ఏలాలి అంటూ ఊదరగొట్టడమే పని.

నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అనే టైపు. అయితే మళ్లీ ఎన్నికలు అయిపోగానే పెద్ద పత్రికల చిన్న ఎడిషన్లకు పూనకం వచ్చేస్తుంది. ప్రజల కష్టాలు కనిపిస్తాయి. ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తాయి. నీటి ఎద్దడులు కనిపిస్తాయి. హాస్టల్ విద్యార్థులకు అందని భోజనం కనిపిస్తుంది. ఇంకా ఇంకా ఎన్ని సమస్యలు కనిపిస్తాయో?

ఎన్నికల వేళ మాత్రం ఇవన్నీ కోల్డ్ స్టోరేజీలోకి తోసేసి జనాల కళ్లకు రంగుల సినిమా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎంత నిస్సిగ్గు అంటే, రాయలసీమ అంతా నీళ్లు గలగలా పారేస్తున్నాయి అని టముకేసి, ఎన్నికలు అయిన మర్నాడే సీమకు నీళ్లు అందడం లేదని వార్త వేసేంతగా.

ఎన్నికలు వచ్చేవరకు..
అవి పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపాల్టీ ఏమైనా కావచ్చు. ఇక ఇదేతంతు. ఎన్నికలు వచ్చాయా? చటుక్కున బట్టలు విప్పేసి, చిడతలు అందుకుని తమ సామాజిక వర్గ ప్రయోజనం, పార్టీ ప్రయోజనం కాపాడుకోవడానికి ఎదుటి వాడి మీద, ఎదుటి వర్గం మీద ఎంతటి బురద అయినా చల్లడమే.

ఏం చేస్తాం తప్పు వాళ్లది కాదు, ఇలా జరుగుతోంది దశాబ్దాలుగా అని తెలిసినా, అదే మీడియాలను ఆదరించడం తప్పవేరు కాదు. అవితప్ప మరోగతి లేదన్నట్లు తయారైంది మరి. కానీ మన బాబుగారు మాత్రం మన మీడియాకు వాళ్లంటే, భయం.. వీళ్లంటే భయం అంటుంటారు.

భయం మాటేమో కానీ, తెలుగుదేశం పార్టీ అంటే మన మీడియాకు ప్రాణం దాన్ని అలా అరచేతులు అడ్డుపెట్టి కాదు, తమ పత్రికలు ఒడ్డి అయినా కాపాడతారు అని మచ్చుకు అయినా అనరు. 

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది

Show comments