మాటలు అలా - బెట్టింగ్ లు ఇలా

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతర చిత్రం విచిత్రంగా వుంది. పోలింగ్ తేదీకి కౌంటింగ్ తేదీకి మధ్య చాలా గ్యాప్ వుండడంతో, రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల ధైర్యం సమానంగానే వుంది. ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. కానీ రెండు రకాలైన భిన్న దోరణులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి.

సాధారణంగా బెట్టింగ్ ట్రెండ్ ను బట్టి ఫలితాలను కాస్త అంచనా వేయవచ్చు. బెట్టింగ్ ట్రెండ్ ఎలావుంటే జనాల్లో స్పందన, జనాభిప్రాయం కూడా అలాగే వుంటుంది. కానీ ఈసారి వ్యవహారం అలాలేదు. బెట్టింగ్ ట్రెండ్ వేరుగా వుంది. జనాల లెక్క వేరుగా వుంది.

బెట్టింగ్ ట్రెండ్ ప్రస్తుతం వైకాపా మీద నడుస్తోంది. 84-92 అనే నెంబర్లు వైకాపా మీద బెట్టింగ్ ఓపెన్ చేసారని తెలుస్తోంది. అంటే వైకాపాకు 84కు తగ్గవని, లేదా 92 వరకు వస్తాయని ఇలా ఈ రెండు ఫిగర్ల మీద రకరకాల ఈక్వేషన్లలో పందాలు సాగుతున్నాయి.

కానీ రాజకీయ ఆసక్తి వున్న వర్గాల్లో, రాజకీయ పార్టీల వర్గాల్లో మాత్రం తెలుగుదేశణ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని 95 సీట్లకు కాస్త ఒకటి రెండు అటు ఇటుగా వస్తాయని వినిపిస్తోంది. ఈ విషయంలో అటు పార్టీ అఫిలియేషన్లకు సంబంధం లేకుండా వినిపిస్తుండడం విశేషం.

దీంతో జనాలు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు ఇలా తేడాగా వినిపిస్తోంది అని సందేహిస్తున్నారు. బెట్టింగ్ జనాలు కావాలని ఏదైనా వైకాపా అంటూ స్ప్రెడ్ చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణలో మహాకూటమి అని విపరీతంగా ప్రచారం జరిగి, వందలకోట్లు పందాల కారణంగా బడాబాబులు నష్టపోయారు. బెట్టింగ్ వీరులు బాగా డబ్బులు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా? లేక నిజంగానే వైకాపాకు ఎడ్జ్ వుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

ఇదిలావుంటే నేషనల్ మీడియా అంతా వైకాపా విజయాన్ని తమ సర్వేల ద్వారా చెప్పినందున, బెట్టింగ్ జనాలు కూడా దాన్నే ఫాలో అవుతున్నారని మరో టాక్ వినిపిస్తోంది. మొత్తంమీద రోజులు గడుస్తున్న కొద్దీ 100కు పైగా సీట్లు, 120-130 అన్న ట్రెండ్ తగ్గుతోంది. ఎవరికి వచ్చినా 95 అన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా?