మాటల్లోను పవన్‌కళ్యాణ్‌ తీరే

విజయ్‌ దేవరకొండకి యూత్‌లో వున్న ఫాలోయింగ్‌ వల్ల అతడిని పవన్‌కళ్యాణ్‌తో పోలుస్తూ వుంటారనేది తెలిసిందే. పవన్‌ ఎలాగైతే తొలి చిత్రాలతో యూత్‌కి దగ్గరయి తర్వాత పెద్ద స్టార్‌గా ఎదిగాడో విజయ్‌ కూడా నేటితరం యువతకి అలా కనక్ట్‌ అయ్యాడు. అతను చేసే సినిమాల తీరు కూడా పవన్‌ మొదట్లో చేసిన చిత్రాలనే గుర్తు చేస్తుంటుంది.

మాటలలోను, మీడియాతో ఇంటరాక్ట్‌ అయ్యే విధానంలో కూడా పవన్‌ ఛాయలు ఇతడిలో బాగా కనిపిస్తున్నాయి. మిగతా యువ హీరోల మాదిరిగా పవన్‌ ఫాన్‌ని అని విజయ్‌ దేవరకొండ ఎప్పుడూ చెప్పలేదు. కానీ అతనిపై పవన్‌ ప్రభావం తెలిసో, తెలియకో పడిందనేది తెలుస్తూనే వుంటుంది.

'గీత గోవిందం' తర్వాత సినిమాలు మానేద్దామని అనుకున్నానంటూ విజయ్‌ మీడియాతో విచిత్రమైన సంగతి చెప్పాడు. ఎవరైనా అంతటి ఘన విజయం వస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. కానీ విజయ్‌ తన తల్లికి కాస్త సుస్తీ చేయడంతో ఇదంతా ఎందుకు, మానేద్దామని అనుకున్నాడట. అడ్వాన్సులు తిరిగిచ్చేద్దామని కూడా అనిపించి తర్వాత ఆ ఆలోచన రైట్‌ కాదని తెలుసుకున్నాడట.

ఇలాంటి మాటలు తరచుగా పవన్‌ మాట్లాడుతుంటాడని, ఇతని మాట తీరు, ఆలోచనా సరళి కూడా పవన్‌నే తలపిస్తున్నాయని సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments