మాస్.. మాస్.. మహేష్

మహేష్ బాబు వచ్చేసాడు 'సరిలేరు నాకెక్వరూ' అన్నట్లుగా. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో స్టిల్ ను దసరా సందర్భంగా విడుదల చేసారు. కొండారెడ్డి బురుజు ముందు కత్తి పట్టుకుని, బస్తీమే సవాల్ అన్నట్లుగా నిల్చున్న మహేష్ బాబు స్టిల్ ఇది. 

మిలటరీ స్టయిల్ ఫ్యాంట్, బ్లాక్ షర్ట్ వేసుకుని, చేతిలో బలమైన గొడ్డలి పట్టుకుని నిల్చున్నాడు మహేష్ బాబు. స్టిల్ లో గెటప్ మాత్రమే కాదు, వెనుక కొండారెడ్డి బురుజు, గంభీరంగా వున్న వాతావరణం అన్నీ కలిసి స్టిల్ కు మాంచి లుక్ ను తీసుకువచ్చాయి. ఈ స్టిల్ లో అసలే ఫిట్ గా వుండే మహేష్ మరి కాస్త స్లిమ్ గా కనిపిస్తున్నాడు.

అనిల్ రావిపూడి అటు ఎంటర్ టైన్ మెంట్, ఇటు యాక్షన్ రెండూ కలిపి సినిమా తీస్తున్నట్లు ఈ స్టిల్ చెప్పకనే చెబుతోంది. ఈ రెండింటిని అనిల్ రావిపూడి బాగానే డీల్ చేయగలరు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాకు నిర్మాతలు అనిల్ రావిపూడి, దిల్ రాజు, మహేష్ బాబు.

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!