మాస్ యాక్షన్ కామెడీ

చైతన్య, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా వెంకీమామ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం. సురేష్ మూవీస్ భాగస్వామ్యం. ఈ సినిమా పండుగ టీజర్ వచ్చింది. సినిమా నేపథ్యం కొత్తగా ఏమీలేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ మధ్య చాలాకాలంగా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ సినిమాలు వస్తూనే వున్నాయి. సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు దగ్గర నుంచి శతమానం భవతి మీదుగా ఎన్నో.

మామ నీడలో ఆట, పాట, ఫైటు అన్నీ నేర్చుకున్న మేనల్లుడిగా చైతన్యను, నేర్పిన మామగా వెంకీని టీజర్ పరిచయం చేసింది. అక్కడితో ఊరుకోకుండా వెంకీ స్టయిల్ కామెడీ తో 'ఐ లవ్ యూ ' డైలాగు ఒకటి. పెద్ద సినిమా, పెద్ద ఆర్టిస్టులు, పల్లెటూరి నేపథ్యంలో. అందువల్ల కలర్ ఫుల్ గానే వుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ ప్లస్ యాక్షన్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు బాబీ.