మరుగుతున్న రక్తం.. ఇదీ మోడీ రాజకీయం.!

'నా రక్తం మరిగిపోతోంది..' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, పుల్వామా టెర్రర్‌ ఎటాక్‌ నేపథ్యంలో 'ఉద్వేగ భరితమైన' వ్యాఖ్యలు చేశారు. 'నాటకీయత' కలిగిన ప్రసంగాలు చేయడంలో నరేంద్ర మోడీ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రసంగాల్లో 'సమ్మోహనం' మీద ఆయన పెట్టే దృష్టి, ఆయన చేతల్లో కన్పించదని చాలా విషయాలు ప్రూవ్‌ చేశాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌ అంశం ముందు వరుసలో నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ గురించి 2014 ఎన్నికల సమయంలో ఆయన ఏం చెప్పారు.? ఆ తర్వాత ఏం చేశారు.? అని బేరీజు వేస్తే, మోడీ చిత్తశుద్ధి ఏంటనేది అర్థమయిపోతుంది.

ఆంధ్రప్రదేశ్‌ సంగతి తర్వాత, 42 మంది జవాన్లు మృతికి కారణమైన తీవ్రవాదంపై నరేంద్ర మోడీ ఎలా స్పందించాల్సి వుంది.? స్పందించకనేం, మాటల్లో బహు గొప్పగా స్పందించేశారు. తీరా ఈ అంశంపై కీలకమైన అఖిలపక్ష భేటీ జరిగితే, ఆ మీటింగ్‌కి నరేంద్ర మోడీ డుమ్మా కొట్టేశారు. ప్రధాన మంత్రి హాజరు కానప్పుడు అఖిలపక్ష సమావేశంలో అర్థమేముంటుంది.? విపక్షాలు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే, నరేంద్ర మోడీ ఆ మీటింగ్‌కి డుమ్మా కొట్టారా.? అంటే, అవుననే అంటున్నాయి విపక్షాలు.

ఇలాంటి సందర్భాల్లో విపక్షాలు రాజకీయం చేయబోవనే ఆశిస్తున్నాం..' అని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలంతా బహు గొప్పగా సెలవిచ్చారు. కానీ, రాజకీయం మొదలెట్టింది సాక్షాత్తూ నరేంద్ర మోడీనే. లేకపోతే, అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరు కాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? తీవ్రవాద నిర్మూలన కోసం నరేంద్ర మోడీ సర్కార్‌ గత నాలుగున్నరేళ్ళలో ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి, ఇప్పుడు ఈ సందర్భంలో ఎలా స్పందిస్తుందో వివరించాలి. కానీ, 'రక్తం మరిగిపోతోంది' అంటూ వేదికలెక్కి ప్రసంగాలు చేయడం మీదున్న శ్రద్ధ, దేశ ప్రజలకు సమాధానం చెప్పడంలో వుండదు కదా.! దటీజ్‌ మోడీ.

పెద్ద పాత నోట్ల రద్దు సమయంలోనే, తీవ్రవాదం అంతమైపోతుందంటూ ప్రగల్భాలు పలికిన మనిషి.. ఆ పెద్ద నోట్ల రద్దు ప్రయోజనాలపై ఇప్పటికీ పెదవి విప్పరాయె. అలాంటిది, తీవ్రవాదం గురించి ఆయనేదో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఎలా ఆశించగలం.?

నాకు ఆవిడంటే చాలా ఇష్టం : వీరమాచినేని 

నాకు స్టామినా చాలా ఎక్కువ

Show comments