మారిషస్ లో శర్వా స్కూబా డైవింగ్

శర్వానంద్ తను చేస్తున్న ఓల్డ్ ఏజ్డ్ మాఫియా డాన్ క్యారెక్టర్ సినిమా ప్యాక్ చేసి, తరువాత సినిమా మీదకు వచ్చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో ఇటీవల ఇటు క్రిటిక్స్ పశంసలు, అటు కమర్షియల్ విజయం కూడా అందుకున్న 96 సినిమా రీమేక్ ను స్టార్ట్ చేసాడు. ఈ సినిమాలో శర్వా సరసన సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో శర్వానంద్ వైల్డ్ లైఫ్ ప్రొటోగ్రాఫర్ గా కనిపిస్తాడు. అందులో భాగంగా శర్వా పాత్ర మీద కొన్ని అడ్వంచరస్ షాట్స్ వున్నాయట. ప్రస్తుతం వీటిని మారిషస్ లో, మరి కొన్ని ప్రాంతాల్లోనూ చిత్రీకరిస్తున్నారు. తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

నిర్మాత దిల్ రాజు ఫస్ట్ టైమ్ చేస్తున్న రీమేక్ ఇది. 96 సినిమాను విడుదలైన వెంటనే ఇలా థియేటర్ లో చూసి, మరో ఆలోచన లేకుండా రీమేక్ రైట్స్ తీసుకుని, అదే తమిళ టీమ్ చేతిలో ప్రాజెక్టు పెట్టేసారు. త్రిష కేరీర్ లో దిబెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అని పేరు వచ్చింది ఈ సినిమాకు. అందుకే ఆ పాత్రకు సమంతను తీసుకున్నారు. 

రంగస్థలం, మజిలీ హిట్ ల మీద వున్న సమంత ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుందని గట్టి నమ్మకంతో వున్నారు. 

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!

Show comments