మహేష్ ను బన్నీ అనుకరిస్తాడా?

ఒకపక్క సూపర్ స్టార్ మహేష్ సినిమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మాదిరిగా పరుగెడుతోంది. సంక్రాంతికి విడుదల అని మాత్రమేకాదు. నవంబర్ నుంచి లేదా డిసెంబర్ నుంచి మహేష్ వేరే సినిమా మీదకు వెళ్లేందుకు వీలుగా కూడా. కానీ అదే సంక్రాంతికి విడుదల కావాల్సిన బన్నీ-త్రివిక్రమ్ సినిమా మాత్రం నిదానమే ప్రదానం అన్నట్లు సాగుతోంది.

మహేష్ ఫస్ట్ లుక్. ఇంట్రడ్యూసింగ్ టీజర్  కూడా బయటకు వచ్చేసాయి. దీంతో బన్నీ అభిమానుల నుంచి ప్రెజర్ స్టార్ట్ అయింది. అందుకే అర్జెంట్ గా ఆగస్టు 15న టైటిల్ అనౌన్స్ మెంట్ అంటూ ముందుగానే పోస్టర్ డిజైన్ చేసి వదిలారు. అభిమానులకు మంచి వార్తే. అయితే బన్నీ కూడా ఇంట్రడ్యూసింగ్ టీజర్ లాంటిది వదిలే ఆలోచన ఏదో చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంటే అచ్చంగా మహేష్ ప్లాన్ చేసినట్లుగానే అన్నమాట. అయితే ఇది త్రివిక్రమ్ స్టయిల్ లో డిఫరెంట్ గా వుండే అవకాశం వుంటుందనుకోండి. పైగా త్రివిక్రమ్ సినిమా కాబట్టి, ఒక పంచ్ పడాల్సిందే. అందువల్ల మహేష్ బాటలోనే బన్నీ కూడా నడిచినా, కాస్త వైవిధ్యంగానే వుండే అవకాశం వుంది.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!

Advertising
Advertising