మహేష్‌, అల్లు అర్జున్‌కి ఇదే మంచి ఛాన్స్‌

టాప్‌ 5 హీరోల్లో ముగ్గురు వేర్వేరు సినిమాలతో దాదాపు రెండేళ్ల పాటు లాక్‌ అయిపోయి వున్నారు. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ రాజమౌళి సినిమా పేరు చెప్పి వచ్చే రెండేళ్లు ఆ పనులతోనే బిజీగా వుంటారు. ఇక ప్రభాస్‌ అయితే అటు సాహో పనులు తెమలక, కొత్తగా మరో భారీ చిత్రాన్ని మొదలు పెట్టాడు.

దీంతో టాప్‌ 5 హీరోల్లో మిగతా ఇద్దరికి ఈలోగా వీలయినన్ని ఎక్కువ చిత్రాలు చేసే అవకాశంతో పాటు పోటీలో మరి కాస్త ముందుకి పోయే వీలు కూడా చిక్కింది. మహేష్‌ ఇప్పటికే ఈ దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. 'మహర్షి' పూర్తయ్యే నాటికి రెండు సినిమాలు లైన్లో పెట్టి సైమల్టేనియస్‌గా రెండూ చేయాలని, హాలిడే తీసుకోవద్దని డిసైడ్‌ అయ్యాడట.

ఎన్నడూ లేనిది 'నా పేరు సూర్య' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ కూడా తదుపరి చిత్రాలని వేగంగా ప్లాన్‌ చేస్తున్నాడట. త్రివిక్రమ్‌తో నెక్స్‌ట్‌ సినిమా కన్‌ఫర్మ్‌ అయిపోయింది. జనవరిలోగా సెట్స్‌ మీదకి వెళుతుంది. అది పూర్తయ్యే నాటికి అల్లు అర్జున్‌వి మరో రెండు ప్రాజెక్ట్‌లు మొదలు కావడానికి సిద్ధమవుతాయి. స్టోరీ సెలక్షన్‌ టీమ్‌ని పెట్టుకుని మరీ అల్లు అర్జున్‌ ఫుల్‌ ప్రిపరేషన్‌తో ముందుకెళుతున్నాడు.

Show comments