మహర్షి రెండోరోజు స్టడీ

భారీ వ్యయం, భారీ మార్కెటింగ్ తో విడుదలైన మహేష్ బాబు మహర్షి తొలిరోజు మంచి ఫలితాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సినిమా గురువారం విడుదల కావడంతో శుక్రవారం కచ్చితంగా కాస్త హెవీ డ్రాప్ వుంటుందని, శని ఆదివారాలు బాగా వుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి.

కానీ సమ్మర్ హాలీడేస్ కావడం, పెద్ద సినిమా కావడంతో, శుక్రవారం నూన్ షోలు మినహా మిగిలిన అన్ని షోలు బాగానే ఫేర్ చేసాయి. విపరీతంగా థియేటర్లు, షోలు ఇచ్చినా మూడువంతులు ఫుల్స్ రావడం విశేషం. పైగా టికెట్ రేట్లు అధికమైనా ఇలారావడం చూసి, బయ్యర్లు ఫాజిటివ్ సైన్ గా ఫీల్ అవుతున్నారు.

నైజాంలో తొలిరోజు ఆరుకోట్లకు పైగా వసూలు చేస్తే, మలిరోజు కూడా మూడుకోట్లకు పైగా వసూలు చేసింది. కృష్ణజిల్లాలో మలిరోజు 74 లక్షల వరకు వసూలు చేయడం విశేషం అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కలెక్షన్ల వివరాలు
నైజాం..................3.28
వైజాగ్...................1.06
కృష్ణా....................0.74
గుంటూరు.............0.49
ఈస్ట్.....................0.60
వెస్ట్......................0.44
నెల్లూరు................0.25

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

Show comments