మహర్షి బిజినెస్ మీద ఫీలర్లు

మహర్షి సినిమా బిజినెస్ ప్రాధమికంగా పూర్తయింది. ఒక్క ఓవర్ సీస్ మాత్రమే అగ్రిమెంట్లు అయ్యాయి. సీడెడ్, ఆంధ్రలోని ఏరియాలు మాటలే తప్ప, అగ్రిమెంట్లు ఇంకా కాలేదు. అయితే మహేష్ మార్కెట్ ఇంకా సూపర్ గా వుంది అని చెప్పడానికో, భరత్ అనే నేను కన్నా తగ్గలేదు అని తెలియ చెప్పడానికో ఫిగర్లపై ఫీలర్లు బయటకు వస్తున్నాయి.

వాస్తవానికి భరత్ అనే నేను అమ్మకం రేట్లకు ఆంధ్రలో మహర్షిని ఇవ్వడంలేదు. భరత్ అనే నేను వసూళ్ల ను బట్టి మహర్షి ఇస్తున్నారు. అలా చేయడం వల్ల కొన్ని ఏరియాల్లో 30 కోట్ల రేషియోనే వర్కవుట్ అవుతోంది. కొన్ని ఏరియాల్లో 38 కోట్ల రేషియో వర్కవుట్ అవుతోంది. భరత్ అనే నేను అలా కాదు, ఆంధ్ర అన్ని ఏరియాలు కలిసి 39 కోట్లు వచ్చాయి. ఇప్పుడు మహర్షి 36 నుంచి 37 మాత్రమే వస్తుంది.

ఇక సీడెడ్  భరత్ అనే నేను 12.6 కు ఇచ్చారు. ఇప్పుడు మహర్షి 12 అడుగుతున్నారు. బయ్యర్ శొభన్ 11 కు అడుగుతున్నట్లు బోగట్టా. ఎందుకంటే భరత్ అనే నేను 10 దగ్గర ఆగిపోయి రెండు కోట్లు నష్టం వచ్చింది. ఇక నైజాం 22 కోట్లు అని ఫీలర్ వదులుతున్నారు.

కానీ నిర్మాత దిల్ రాజు 17 నుంచి 18 కోట్ల రేషియోతో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే భరత్ అనే నేను 22 కు ఇచ్చినా వర్కవుట్ కాలేదు. అందుకే 18కే ఆయన లెక్కు కడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర, సీడెడ్, ఓవర్ సీస్ తగ్గించి నైజాం మాత్రం ఎక్కువ అంటే ఒప్పుకునేందుకు దిల్ రాజు ఏమన్నా అమాయకులా? పైగా ఓవర్ సీస్ ఎన్ఆర్ఐ చేసారు. అంటే ఓ మెట్టు దిగినట్లేగా?

కానీ టోటల్ బిజినెస్ ఎక్కువ చూపించి, మహేష్ మార్కెట్ తగ్గలేదు అనే ప్రయత్నం కోసమే ఈ పీలర్లు అని వినిపిస్తోంది. నిజానికి అదర్ దాన్ థియేటర్ రైట్స్ 47 కోట్లు వచ్చాయి కాబట్టి సరిపోయింది. లేదంటే దర్శకుడు వంశీ పైడిపల్లి చేయించిన ఖర్చుకు ఓవర్ బడ్జెట్ అయివుండేది. 

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!

Show comments