జూనియర్ ఎన్టీఆర్ పై లోకేష్ తేల్చేసినట్టే!

తెలుగుదేశం పార్టీ అభిమాన సామాజికవర్గం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంది. లోకేష్ తో కుదిరేది కాదు, చంద్రబాబుకు వయసు అయిపోయింది..  ఇక జనాలు చంద్రబాబును నమ్మే అవకాశాలు లేవు… పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటూ చంద్రబాబు నాయుడు మరో తప్పు చేస్తూ ఉన్నారు.. పార్టీకి కొత్త రక్తం కావాలి, అది జూనియర్ ఎన్టీఆరే అనే వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కేవలం ఓడిపోయి ఉంటే ఈ వాదనలకు పెద్దగా ఆస్కారం ఉండేది కాదు, అయితే తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 

ఇలాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై చర్చ సాగుతూ ఉంది. లోకేష్ ఇంకా డెవలప్ అయ్యింది లేదని కూడా తేటతెల్లం అవుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో తారక్ కావాలని కొంతమంది కోరుకుంటూ ఉన్నారు. పార్టీని వీడే వాళ్లు కూడా తెలివిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి తప్పుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఆ విమర్శలపై లోకేష్ ఇన్ డైరెక్టుగా స్పందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను తను తొక్కేసిన వైనం గురించి లోకేష్ మాట్లాడుతూ, తారక్ కథ ఇప్పటిది కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం 2009 లో పనిచేశారని, 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ లోకేష్ నొక్కుతున్నారు! 

పార్టీ గెలిచిన ఎన్నికల్లో తారక్ పార్టీ తరఫున పని చేయలేదనే విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు.  తద్వారా పార్టీకి ఆయన అవసరం లేదన్నట్టుగా మరోసారి కుండబద్దలు కొట్టారు చంద్రబాబు  నాయుడి తనయుడు. ఇప్పటికే లోకేష్ తోడల్లుడు ఇదే విషయాన్ని చెప్పారు, ఇప్పుడు లోకేష్ కూడా అదే విషయాన్ని చెప్పారు.

Show comments