లోకేష్ కామెడీ.. వైసీపీకీ తలనొప్పిగా మారిందా?

సోషల్ మీడియాలో లోకేష్ ఏదైనా ట్వీట్ పెడితే అది పెద్ద కామెడీ. ఆ రోజంతా ఆ ట్వీట్ తో నెజిటన్లు సరదాగా నవ్వుకున్నారు. తమకు తోచిన కామెంట్ పెడుతుంటారు. కనీస స్థాయిలో కూడా బుర్ర వాడకుండా లోకేష్ పెట్టే ట్వీట్లు ఒక్కోసారి జబర్దస్త్ కామెడీ ఎపిసోడ్ ను కూడా తలపిస్తుంటాయి. దీంతో వైసీపీ కూడా లోకేష్ ట్వీట్లను ఎంజాయ్ చేయడం వరకే పరిమితం చేసింది. ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఈసారి లోకేష్ నిజంగానే ట్విస్ట్ ఇచ్చారు. ఇదిప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారుతుందేమో చూడాలి.

సహజంగా పెట్టే కామెంట్స్ కి కూడా అసభ్యకర మెసేజ్ లంటూ లోకేష్ నానాయాగీ చేస్తున్నారు. లోకేష్ కి వంతపాడుతూ భజన బృందం కూడా పోలీసుల దగ్గరకి వెళ్లి కేసులు పెడుతున్నాయి. ఆ మధ్య దేవినేని అవినాష్.. సోషల్ మీడియాలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కేసులు పెట్టారు. తాజాగా తాడేపల్లి టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులపై కేసులు పెట్టారు.

కామెడీ ఏంటంటే.. లోకేష్ కి ఈ పోస్టింగ్ లు పెట్టిన వ్యక్తులతో ప్రాణహాని ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో చేసేదేంలేక ఆళ్ల కూడా ఇదే రూట్లోకి రావాల్సి వచ్చింది. అప్పటివరకూ తాను కూడా సోషల్ మీడియా కామెంట్స్ ని లైట్ తీసుకున్నా.. లోకేష్ టీమ్ నోరు మూయించడానికి ప్రతిగా కేసులు పెట్టారు. తనకు కూడా ప్రాణహాని ఉందని, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు, కామెంట్లు పెడుతున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని కంప్లయింట్ ఇచ్చారు.

ఇప్పటికే లోకేష్ కేసులతోనే సతమతమవుతుంటే.. ఆళ్ల వర్గం కూడా రంగంలోకి దిగడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఈ పంచాయతీ ఇక్కడితో తెగేలా లేదని వాపోతున్నారు. మొన్నటివరకు లోకేష్ ట్వీట్స్ ను వైసీపీ కామెడీగా తీసుకుంది. అందరితో పాటు వైసీపీ నేతలు కూడా అతడి ట్వీట్స్ చూసి నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు కేసుల వరకు వ్యవహారం రావడంతో వైసీపీ వాళ్లకు తలనొప్పులు తప్పడంలేదు. నిజానికి ఇలాంటి కేసులు వైసీపీ వాళ్లను ఏం చేయలేవు. కాకపోతే ఇప్పటికే ఉన్న పనులకు తోడు లోకేష్ చేస్తున్న ఇలాంటి చిలిపి పనుల వల్ల వాళ్లకు మరింత చిరాకు పెరుగుతోందంతే.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..