నెక్ట్స్ చంద్రబాబు ఇళ్లే.. ఖాళీ చేయాల్సిందే!

నదీ పరివాహక ప్రాంతంలో నిర్మితమైన అక్రమకట్టడం ప్రజావేదికను కుప్పకూల్చిన అనంతరం ఏపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో నిర్మితమైన ఇతర అక్రమ కట్టడాల మీద దృష్టి పెట్టినట్టుగా ఉంది. కృష్ణానది కరకట్ట మీద నిర్మితమైన అన్ని అక్రమ కట్టడాలనూ తొలగించడానికి ఏపీ ప్రభుత్వం సమాయత్తం అవుతూ ఉంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడి అద్దె ఇంటిని కూడా కూల్చేసే అవకాశం కనిపిస్తూ ఉంది.

ఇప్పటికే కూల్చివేసిన 'ప్రజావేదిక'ను నిర్మించినదే చంద్రబాబు నాయుడి అద్దె గృహానికి అనుకుని. లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబు నాయుడు అద్దెకు తీసుకుని అక్కడే మకాం పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు మకాం పెట్టిందే అలా ఒక అక్రమ కట్టడంలో. ఆ అక్రమ కట్టడాన్ని అనుకుని, ప్రభుత్వ సొమ్ముతో ప్రజావేదికను అక్రమంగా నిర్మించారు. ముందుగా ప్రజా వేదికను కూల్చి.. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాల పని పడతామని ప్రభుత్వం చెబుతూ ఉంది.

ఈ నేపథ్యంలో లింగమనేని ఎస్టేట్స్ కూడా కుప్ప కూలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిణామాల మధ్యన వీలైనంత తొందరగా చంద్రబాబు నాయుడు అందులోంచి మూటాముల్లె సర్దుకుని బయటకు రావడం ఉత్తమం అని పరిశీలకులు చెబుతూ ఉన్నారు.

ఈ అంశంపై కోర్టుకు వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ భవనాన్ని కూల్చినప్పుడే అభ్యంతరం చెప్పలేదు న్యాయస్థానం. అలాంటిది ప్రైవేట్ అక్రమ కట్టడాలను కోర్టు అయినా రక్షిస్తుందని అనుకోవడం భ్రమే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments