లీడింగ్ చానెళ్ల లెక్కలు ఇవి

తెలుగునాట పలు టీవీ చానెళ్లు వున్నాయి. వాటిలో మూడు నాలుగు లీడింగ్ చానెళ్లు వున్నాయి. వీటిలో చాలావరకు ప్రో టీడీపీ స్టాండ్ వున్నవే. ఇవన్నీ కాస్త అటే మొగ్గి వుంటాయి. మొగ్గు చూపుతుంటాయి. ఈ చానెళ్లన్నీ గత రెండు రోజులుగా తమ నెట్ వర్క్ ను వినియోగించి ఎన్నికల పలితాలు ఎలా వుంటాయో అన్నది ఓ అంచనా రప్పించే ప్రయత్నంలో పడ్డాయి. అన్నింటికన్నా లీడింగ్ లో వుండే చానెల్ చంద్రబాబుకు వంద సీట్లు వస్తాయని అంచనావేసినట్లు తెలుస్తోంది. కచ్చితంగా వంద సీట్లతో చంద్రబాబు మళ్లీ పవర్ లోకి వస్తారని ఈ చానెల్ కీలక బాధ్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీని తీవ్రంగా మోస్తున్న మరో చానెల్ కాస్త నికార్సుగా ఫలితం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు బోగట్టా. ఈ సర్వేలో జగన్ కు 70 సీట్లు తగ్గవని, 90 సీట్లు చంద్రబాబుకు పక్కా అని తేలిందని తెలుస్తోంది. మిగిలిన 15 సీట్లలో అయిదు వరకు జనసేనకు రావచ్చని, మిగిలిన పదిలో ఎటూ తేల్చలేని ఫైట్ వుందని తెలిసిందట. ఒకవేళ ఈ పదిహేను సీట్లలో అధికభాగం జగన్ కు వస్తే అప్పుడు 80 సీట్లతో తెలుగుదేశానికి దగ్గరగా వస్తారని అంటున్నారు.

ఇంకో చానెల్ చాలా గుంభనంగా, పక్కా సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన చానెళ్లకు లేని సదుపాయం ఈ చానెల్ కు ఉంది. విస్తృతమైన నెట్ వర్క్ వుండడంతో, టైమ్ తీసుకుని, జాగ్రత్తగా సర్వే చేయించే పనిలో ఆ చానెల్ వున్నట్లు తెలుస్తోంది. అది రావడానికి మరోరోజు పడుతుందని బొగట్టా.

ఇదిలావుంటే భీమిలి నుంచి పోటీ చేసిన తేదేపా అభ్యర్థి సబ్బంహరి కూడా చంద్రబాబుకు వందలోపు స్థానాలే వస్తాయని, అందరూ చెబుతున్నట్లు వందకు పైగా రావడం సాధ్యంకాదని చెప్పడం విశేషం. ఇటు తేదేపా అనుకూల చానెళ్లు, తేదేపా అభ్యర్థులు కూడా వందలోపు లోనే చంద్రబాబు బలాన్ని వుంచడం కాస్త ఆలోచించదగ్గ విషయమే.

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను

Show comments