క్రిష్ పై బాలయ్య ఫైర్?

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో డైరక్టర్ గా క్రిష్ వచ్చినప్పటి నుంచి అంతా మారిపోయింది. ఒరిజినల్ ప్లాన్ మొత్తం క్రిష్ స్టయిల్ లోకి, ఆయన అధీనంలోకి వెళ్లిపోయింది. క్రిష్ చేసిన మొదటి పని రెండు భాగాలుగా చేయడం. ఇదే సినిమాకు అతి పెద్ద తప్పిదమైంది. దీనివల్ల తొలిసగంలో సినిమా వ్యవహారాలు తప్ప మరో ఎమోషన్ లేకుండా పోయింది.

తొలిసగంలో కంటెంట్ నిడివి కోసం సాగదీసినట్లు అయింది. సరే ఆ సంగతి అలాపెడితే, క్రిష్ చేసిన మరో పని రెండు భాగాలకు కలిపి ఒకటే పబ్లిసిటీ ప్లాన్ చేయడం. దాదాపు రెండు సినిమాల గెటప్ లను, కంటెంట్ ను ముందే రివీల్ చేసేసారు. తొలిసగం చివర్లోనే మలిసగం పాత్రలను కూడా పరిచయం చేసేసారు.

అంతేకాదు, రెండింటికీ కలిపి ఒకటే ట్రయిలర్, ఒకటే అడియో, ఒకటే ఫంక్షన్ అంటూ కానిచ్చేసారు. తొలిభాగం మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ వుండడం, రెండు భాగాల విడుదల తేదీలకు మధ్య పెద్దగా గ్యాప్ (ముందు అనుకున్నప్రకారం) లేకపోవడం వల్ల ఇలా ప్లాన్ చేసారు. తీరా చూస్తే తొలిభాగం మిస్ ఫైర్ అయింది. ఇక మలి భాగానికి ఏమీ చేయడానికి మిగలలేదు. ఒక కొత్త స్టిల్ లేదు, ఒక కొత్త లుక్ లేదు. పైగా రెండోభాగం అమ్మకుండా డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చేసారు.

దాంతో ప్రచారంను పక్కన పెట్టారు. ఇలాంటి టైమ్ లో క్రిష్ ఊరుకోకుండా ట్రయిలర్ విడుదల చేయాలని ప్లాన్ చేసారు. వాస్తవానికి ట్రయిలర్ విడుదలను బాలయ్య వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంక ఏమీ చేయవద్దు, సినిమాను అలా వదిలేయమని బాలయ్య చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

అయితే సినిమాకు కాస్త అయినా హడావుడి వుండాలని, రెండో భాగంలో వున్న పొలిటికల్ ఎమోషన్ ను ట్రయిలర్ ద్వారా చెప్పాలని క్రిష్ ఎలాగోలా బాలయ్యను కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు తీరా ట్రయిలర్ విడదుల చేసిన తరువాత అన్ని వైపుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ప్రో తెలుగుదేశం మీడియా కూడా అంతగా అనుకూలంగా స్పందించలేదు.

ట్రయిలర్ మీద ఫీడ్ బ్యాక్ తెలుసుకున్న బాలయ్య దర్శకుడు క్రిష్ మీద కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది. క్రిష్ పనితీరు విషయంలో బాలయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు బోగట్టా. ఏమైనా మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభను ఆకాశం అంత ఎత్తుకు పెంచితే, ఇప్పటికే అనేకసార్లు ప్రూవ్ అయిన క్రిష్ ప్రతిభను కిందకు దిగజార్చేసింది.

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!

Show comments