కొత్త దర్శకుడితో నాగ్?

కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో తన కెరీర్ నుంచి ముందు అడుగు వేస్తూనే వున్నాడు హీరో నాగార్జున. ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. ఎంతోమంది పైకి వచ్చే చాన్స్ ఇచ్చాడు. ఇటీవల వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న నాగ్ మళ్లీ మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి, హిట్ కొట్టే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ మధ్య సూపర్ హిట్ అయిన మహర్షి సినిమా రైటర్లలో ఒకరైన సోలోమన్  చెప్పిన కథ విని, అతనికే డైరక్షన్ అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నాగ్ సన్నిహిత బ్యానర్ మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మించే అవకాశం వుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్, ఈ ప్రాజెక్టు సాద్యాసాధ్యాలపై డిస్కషన్లు సాగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే, ప్రాజెక్టు త్వరలో ప్రారంభించాలన్నది నాగ్ ఐడియా అని తెలుస్తోంది.

ఇదిలావుంటే నాగ్ ఎప్పటి నుంచో అనుకుంటున్న డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమా ఇంకా అలాగే వుంది. అది సెట్ మీదకు వెళ్లాలి. అంటే చైతన్య కూడా రెడీ కావాలి. కానీ నాగ్ డేట్ లు సెట్ అయితే చైతన్య బిజీగా వుంటున్నాడు. చైతన్య రెడీ అయితే నాగ్ బిజీగా వుంటున్నాడు. దాంతో డైరక్టర్ కళ్యాణ్ కృష్ణను మాత్రం ఖాళీగా వుంచుతున్నారు.

జగన్... గారాబం చేయడం నేర్చుకోవాలి!