కోడెల బాధితులు.. ఆగ్రిగోల్డ్ తో పోటీనా!

ఏపీలో అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య గట్టిగా ఉంటుంది. ఆ సంఖ్యతో పోటీపడేలా ఉన్నారు కోడెల బాధితులు! గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రాంతాల్లో 'కే ట్యాక్స్' బాధితుల సంఖ్య గట్టిగా ఉందని స్పష్టం అవుతోంది.

తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల శివప్రసాద్ కొడుకు, కూతురు అడ్డగోలుగా జనాలను బెదిరించి డబ్బులు సంపాదించారనే ఆరోపణలు చాన్నాళ్ల నుంచి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంతో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో వీరి బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారు.

తమతో కోడెల సంతానం కప్పం కట్టించుకుందని, అనేక రకాలుగా బెదిరించి వసూళ్లకు పాల్పడిందని బాధితులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ తాము బయటకు రాలేకపోయినట్టుగా, ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవిస్తున్నారు కే ట్యాక్స్ బాధితులు!

ఇప్పటికే కోడెల శివరాం మీద, కోడెల శివప్రసాద్ కూతురు విజయలక్ష్మి మీద కేసులు నమోదు అయ్యాయి. అయితే అది అంతటితో ఆగేలా లేదు. మరికొందరు బాధితులు బయటకు వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు  పోలిస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు! వీరి బాధితుల సంఖ్య గట్టిగా ఉందని.. గుంటూరుతో మొదలుపెట్టి, నంద్యాల వరకూ వీరి బాధితులు ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది!

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్