కీర్తీ సురేష్.. ఆ దర్శకుడితో కలిసి థ్రిల్లర్!

ఉత్తమ నటిగా జాతీయ అవార్డును పొంది తన స్థాయిని చాలా పెంచేసుకున్న కీర్తీ సురేష్ ఇప్పుడు లేడీ ఓరియెంటెండ్ సినిమాలతో మరింత దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు జాతీయ నటిగా అలా పురస్కారం లభించగానే మరో సినిమా అనౌన్స్ అయ్యింది.

ప్రస్తుతం కీర్తీ సురేష్ కు చేతినిండా సినిమాలున్నాయి. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న ఆమె తమిళంలో విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మోహన్ లాల్ హీరోగా మలయాళంలో రూపొందుతున్న ఒక సినిమాలో కూడా కీర్తీ నటిస్తోంది.

వీటితో పాటు త్వరలోనే మరో సినిమా ప్రారంభం కాబోతోంది. దాన్ని తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే రజనీకాంత్ 'పేట' సినిమాను రూపొందించిన కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాతగా ఈ సినిమాను చేస్తున్నాడు. 

ఇదొక థ్రిల్లర్ అని సమాచారం. ఈశ్వర్ కార్తిక్ ఈ సినిమాతో దర్శకుడుగా మారబోతున్నాడట. ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాలకూ, అందునా లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్లకు మంచి కాలం నడుస్తోంది. ఇప్పుడు కార్తీ సురేష్ పేరు కూడా మార్మోగుతోంది.  దీంతో ఈ సినిమాకు వివిధ భాషల్లో మార్కెట్ ఖాయంగా ఉంటుంది.

Show comments