కేసీఆర్ గెలుపు.. మళ్లీ ఆ కదలికలు!

కాంగ్రెస్ వెంట నడిచేది లేదు, బీజేపీతో కలిసేది లేదు అని అనేశాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. తెలంగాణలో సంచలన విజయాన్ని సాధించిన ఉత్సాహంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీలోనూ చక్రం తిప్పుతామని అన్నాడు. అలాగని కాంగ్రెస్ వైపు కానీ, బీజేపీ వైపు కానీ మొగ్గుచూపే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. మూడోకూటమి అనే అంటున్నాడు కేసీఆర్.

ఈ విషయంలో వివిధ పార్టీల నేతల పేర్లు కూడా చెప్పాడు. మమతా బెనర్జీని కలుపుకుంటామని, మాయవతిని కలుస్తామని, తను అసదుద్ధీన్ ఒవైసీ కలిసి దేశమంతా తిరుగుతామని కేసీఆర్ వ్యాఖ్యానించాడు. ఇది వరకూ కూడా కేసీఆర్ ఈ కూటమి ప్రయత్నాలు చేశాడు. ఆ మధ్య బెంగళూరు వెళ్లి దేవేగౌడను, చెన్నై వెళ్లి స్టాలిన్ ను, ఒడిశా వెళ్లి నవీన్ పట్నాయక్ ను కలిసినట్టుగా ఉన్నాడు.

వీరిలో దేవేగౌడ, స్టాలిన్ లు ఇప్పుడు కాంగ్రెస్ పక్షంలో ఉన్నట్టే. పట్నాయక్ మాత్రం ఎటూలేడు. మరి కేసీఆర్ రంగంలోకి బీజేపీయేత, ఎన్డీయేతర పక్షాలన కులుపుకుని.. కాంగ్రెస్ కూటమిలోని పార్టీలనూ బయటకు తీసుకురాగలడా.. అలాంటి ప్రయత్నం ఢిల్లీలో గట్టిగానే సాగుతుందా అంటే ప్రస్తుతానికి సమాధానం లేదు.

కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాలను అంత సీరియస్ గా తీసుకోవడానికి లేదూ లైట్ తీసుకోవడానికీ లేదు. ఏం జరుగుతుందో ముందు ముందు చూడాల్సి ఉంది.

Show comments