కేసిఆర్ నుంచి క్లారిటీ....?

టాలీవుడ్ కాస్త కన్ఫ్యూజన్ లో వుంది. సినిమా థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం ఏమైన ఆంక్షలు విదిస్తుందా? అలా అయితే విడుదల చేయల్సిన సినిమాల పరిస్థితి ఏమిటి? స్కూళ్లు మూసేసి థియేటర్లు, బార్లు తెరవడంపై కోర్టు నిన్నటికి నిన్న గట్టిగ కామెంట్ చేసింది. 

ఈ నేపథ్యంలో ఫ్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ పెద్దలు కొందరు నేరుగా సిఎమ్ కేసిఆర్ ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చే క్లారిటీ బట్టి ఈ నెల 16 నుంచి విడుదలయ్యే సినిమాల భవితవ్యం ఆధారపడి వుంటుంది. 

ఈ వీకెండ్ లోపల అయితే ఎలాంటి నిర్ణయం వుండకపోవచ్చు. ఉగాది తరువాత నుంచి వుంటే వుండొచ్చు అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి. 

ఒకవేళ ఉగాది వేళకు ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ నిబంధన వస్తే వకీల్ సాబ్ నెత్తిన పాలు పోసినట్లే. ఆ నిబంధనతో లవ్ స్టోరీ విడుదల కాకపోవచ్చు. అప్పుడు రెండు వారాల పాటు థియేటర్లో వకీల్ సాబ్ తప్ప మరో సినిమా వుండదు. ఇప్పటికే థియేటర్లు అన్నీ సరైన సినిమాలు లేక ఖాళీగా వున్నాయి. 

Show comments