కేసీఆర్ ఫ్యామిలీ.. ఏ సినిమానూ వదలదా?

మొత్తానికి కేసీఆర్ కుటుంబం సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది. గత నాలుగేళ్ల నుంచి కేసీఆర్ తనయుడు కేటీఆర్ సినిమా వాళ్ల పక్కన కనిపించేందుకు చాలా ప్రాధాన్యతే ఇస్తూ వస్తున్నాడు. ఏ సినిమా వాళ్లనైతే గతంలో ‘సీమాంధ్రులు’గా సంబోధించారో.. అదే సినిమా వాళ్లతో కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం చాలా రాసుకుపూసుకు తిరుగుతూ వస్తోంది. ఇక సినీ పరిశ్రమ కూడా కేసీఆర్ ను ఒక రేంజ్‌లో మోస్తూ వస్తోంది.

సినీ పరిశ్రమది అవసరం. హైదరాబాద్‌లో తమ వ్యవహారాలను సజావుగా నడుపుకోవాలంటే ఇక్కడి ప్రభుత్వంతో చాలా అవసరమే ఉంటుంది. అందుకే సినిమా వాళ్లు అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ భజన చేస్తూ వస్తున్నారు. వీళ్లలో మెజారిటీ నటీనటులది ఒకటే బాట. వాళ్లకు ఎవరు అధికారంలో ఉన్నా ఒకటే. వాళ్ల స్టూడియోలు, వాళ్ల వ్యాపారాలు చక్కగా సాగిపోవాలి. అందుకే.. వీళ్లు ఇప్పుడు కేసీఆర్ భజన చేస్తూ వస్తున్నారు. రేపు హైదరాబాద్ పై గ్రిప్ సాధిస్తే.. అప్పుడు వాళ్లను ఎత్తుకుంటారు. అంతే కథ.

ఇక కేసీఆర్ కుటుంబీకులు మాత్రం సినిమా వాళ్లతో చాలా పర్సనల్ గా వెళ్లిపోతూ ఉన్నారు. కేటీఆర్ కొంత కాలం పాటు సినిమాల ప్రమోషన్ తోనే కనిపించాడు. సినిమా వాళ్లతో బాగా వేదికను పంచుకొంటూ వచ్చాడు. ఆ మధ్య ‘శ్రీమంతుడు’ సినిమా వచ్చినప్పుడు అయితే.. తన కథే అదన్నట్టుగా ఆ సినిమా ప్రమోషన్‌లో దిగిపోయాడు. ఆ తర్వాత ఆ పరంపర కొనసాగుతూ వచ్చింది.

ఇక ఈ మధ్య కాలంలో కవిత కూడా రంగంలోకి దిగింది. ఇటీవల కవిత ‘గీతగోవిందం’ సినిమాను తెగ ప్రమోట్ చేసింది. ఆ సినిమాను తను ఎన్నోసార్లు చూశానని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ‘యూటర్న్’ వంతు వచ్చింది. ఈ సినిమాను, సమంతను ఆకాశానికెత్తేస్తోంది కవిత. ఇలా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో టీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ చాలా ముందుంది. ఇది వరకూ రూలింగ్ పార్టీల వాళ్లు సినిమా వాళ్లతో టచ్లో ఉండే వారే కానీ, ఇలా సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం చేపట్టే వాళ్లు కాదు.

యూటర్న్ సక్సెస్ మీట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

Show comments