చంద్రబాబుపై కేసీఆర్ సునామీ.. ఆంధ్రాలోనట.!

ఇది క్లియర్‌.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఘాటైన సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. అక్కడా, ఇక్కడా కాదు.. ఏకంగా, అమరావతి వేదికగా చంద్రబాబుకి సమాధానమిచ్చేందుకు కేసీఆర్‌, రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎప్పుడు.? ఎలా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. కొట్టబోయే దెబ్బ మాత్రం, చాలా గట్టిగా వుండబోతోంది. 

విజయవాడ వేదికగా, చంద్రబాబు 'బండారం' బయటపెడ్తానంటూ, తెలంగాణ ఎన్నికల్లో గెలుపు అనంతరం మీడియా ముందుకొచ్చిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 'హెచ్చరికలు' జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్‌, అందుకు తగ్గట్టుగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికల్ని తీసుకొచ్చారు. ఆయన వ్యూహం సగం విజయవంతమయ్యింది. తెలంగాణలో సత్తా చాటారు. ఇకపై, ఢిల్లీలో చక్రం తిప్పడమే మిగిలి వుంది. 

ఢిల్లీ స్థాయిలో కేసీఆర్‌ రాజకీయ మంత్రాంగం ఎలాంటి ఫలితాల్ని ఇస్తుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌పైనా ఫోకస్‌ పెట్టాలన్న కేసీఆర్‌ ఆలోచన మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకి దిమ్మ తిరిగిపోయే షాక్‌ ఇవ్వబోతోంది. మజ్లిస్‌ని వెంటేసుకుని, కేసీఆర్‌ - ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం, మైనార్టీ ఓటు బ్యాంకుకి చంద్రబాబు పూర్తిగా దూరమవ్వాల్సి వస్తుంది. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఆలోచనలు కేసీఆర్‌ వద్ద వున్నట్లే కన్పిస్తున్నాయి. 

మొత్తమ్మీద.. చంద్రబాబు, ఇకపై కేసీఆర్‌కి కౌంటర్‌ ఇచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు. 'సైబరాబాద్‌ నా మానస పుత్రిక..' అని తెలంగాణలో చంద్రబాబు చెప్పుకుని తిరిగారు. ఎవరూ కేర్‌ చేయలేదు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గ్రేటర్‌ హైద్రాబాద్‌లో టీడీపీ దక్కించుకోలేకపోయింది. ఇంతకన్నా చంద్రబాబుకి అవమానం ఇంకేముంటుంది.? 

తెలంగాణ ఎన్నికల్లో తనకు తాను 'స్టార్‌' అని ప్రకటించేసుకుని, చంద్రబాబు తెగ హడావిడి చేసేశారు. ఇప్పుడిక, కేసీఆర్‌.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు.. తెలంగాణ తరహా ప్రజా సునామీ తప్పన్న సంకేతాలు పంపుతున్నారు.. ఖచ్చితంగా అవి చంద్రబాబు వ్యతిరేక శక్తులకు బలాన్నిచ్చేవే అవుతాయనుకోండి.. అది వేరే విషయం. అదే జరిగితే, చంద్రబాబు పరిస్థితి ఏంటట.? మొత్తంగా చంద్రబాబు రాజకీయాలకు దూరమవ్వాల్సి వస్తుందేమో.!  

Show comments