కవచం విడుదల పక్కాయేనా?

బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ సినిమా కవచం. ఈ సినిమాకు వున్నట్లుండి రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 7న విడుదల అంటూ. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 7న విడుదల వుంటుందా? 14కు వెళ్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనికి కీలకకారణం, సినిమా పని ఇంకా పూర్తి కాకపోవడమే. ఈనెలాఖరు వరకు ఇంకా పాటలు వగైరా పనులు వున్నాయి. పోనీ పాటలు అతికించేయడమే అనుకున్నా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కాస్త ఎక్కువే వున్నాయని తెలుస్తోంది.

చాలా హర్రీ హర్రీగా రెడీ చేస్తే, తప్ప 7కు రెడీ కావడం కష్టం అని వినికిడి. పైగా ఏడవ తేదీన పుంఖానుపుంఖాలుగా సినిమాలు వున్నాయి. శుభలేఖలు, సుబ్రహ్మణ్యపురం, హుషారు సినిమాలు షెడ్యూలు అయి వున్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలే కావచ్చు. అటు రోబో వుండి, ఇటు మూడునాలుగు చిన్న సినిమాలు వున్న టైమ్ లో విడుదల అంటే కాస్త ఆలోచించాల్సిందే.

14న పెద్దగా సినిమాలు లేవు. అందువల్ల కవచం సినిమాను లాస్ట్ మినిట్ లో 14న విడుదల అన్నా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది.

Show comments