కాంగ్రెస్ తో రాజీపడ్డ రెబల్!

రాజేంద్రనగర్ లో టీడీపీకి అసలేం బలముందని ఆ పార్టీకి టికెట్ ఇచ్చారు అంటూ ధ్వజమెత్తిన కార్తిక్ రెడ్డి రాజీ పడిపోయాడు. తనకు టికెట్ దక్కనీయకుండా కాంగ్రెస్ హైకమాండ్ ఆ సీటును తెలుగుదేశం పార్టీకి త్యాగంచేయడంపై కార్తిక్ రెడ్డి మండిపడ్డ సంగతి తెలిసిందే. తను ఆశించిన సీటు దక్కకపోవడంతో అక్కడ నుంచి రెబల్ గా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించిన ఈయన మెత్తబడినట్టుగా తెలుస్తోంది. రాజీ ధోరణితో ముందుకు వెళ్తున్నాడు ఇంద్రారెడ్డి కొడుకు.

తను కూటమి అభ్యర్థి కోసం పనిచేస్తాడో చేయడో తెలియదు కానీ.. ప్రస్తుతానికి రెబల్ గా అయితే పోటీ చేయలేదు. నామినేషన్ గడువు కూడా పూర్తి అయిన నేపథ్యంలో కార్తిక్ రెడ్డి రాజీపడిన వార్తలు వస్తున్నాయి. అధిష్టానం సూచన ప్రకారం నడుచుకుంటున్నాడట కార్తిక్.

ఈయన రాజీపడటానికి కారణం తల్లి సబిత కూడా ఒక కారణం అనిచెప్పాలి. ప్రస్తుతం ఆమె మహేశ్వరం నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగారు. ఇలాంటి నేపథ్యంలో కార్తిక్ వెళ్లి ఇండిపెండెంట్ గా పోటీచేస్తే,. సబిత గెలుపు కూడా ప్రశ్నార్థకమే అవుతుంది.

అందుకే కార్తిక్ రెడ్డి వెనక్కు తగ్గినట్టుగా ఉన్నాడు. రాజేంద్రనగర్ సంగతి పక్కనపెట్టి మహేశ్వరంలో తల్లిని గెలిపించుకునేందుకు కార్తిక్ ప్రయత్నించవచ్చిక. మొత్తానికి ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ కు రెబల్ టెన్షన్ తగ్గినట్టే!

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments