రెండేళ్ల తర్వాతే పిల్లలంటున్న హీరోయిన్!

ఇప్పటికే తైమూర్ అలీఖాన్‌కు జన్మనిచ్చిన కరీనా కపూర్ మళ్లీ తల్లి కావడంపై స్పందించింది. ఇప్పట్లో మళ్లీ తల్లి అయ్యే ఉద్దేశం తనకు లేదని కరీనా అంటోంది. ప్రస్తుతం వివిధ సినిమాలతో బిజీగా ఉంది కరీనా. ప్రస్తుతానికి తన కాన్సన్‌ట్రేషనంతా సినిమాల మీదే అని ఆమె అంటోంది.

ఇప్పటికే కరీనా కుమారుడు తైమూర్ అలీఖాన్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ముందుగా ఇతడి పేరు హాట్ టాపిక్‌‌గా నిలిచింది. భారతదేశంపై దండెత్తి వచ్చిన ఒక ముస్లిం పరదేశీయుడి పేరును సైఫ్ తన తనయుడికి పెట్టాడని అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే వాటిని కరీనా కానీ, పటౌడీలు కానీ అస్సలు లెక్క చేయలేదు.

జనాలు కూడా ఆ టాపిక్‌ను అలా వదిలేశారు. ఆ తర్వాత తైమూర్ క్యూట్ నెస్ సోషల్ మీడియాకు బాగా ముద్దొచ్చింది. కరీనా, సైఫ్ ల తనయుడు మీడియాకు ఎప్పుడు కనిపించినా కెమెరాలు క్లిక్ మంటూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక సెలబ్రిటీ అయిపోయాడు తైమూర్. ఇలాంటి నేపథ్యంలో కరీనా మళ్లీ తల్లి అవుతుందా? అనే ప్రశ్న కూడా మీడియాకు ఆసక్తిదాయకంగా తోచింది. ఈ ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించుకోకుండా.. మరో రెండేళ్ల తర్వాత అని సమాధానం ఇచ్చింది కరీనా.

మరో రెండేళ్లకు అంటే అప్పటికి సైఫ్ అలీఖాన్ పెద్దకూతురు పెళ్లీడుకు వచ్చేస్తుంది. తాతయ్య అయ్యే వయసులో సైఫ్ మళ్లీ తండ్రి అవుతాడనమాట!

RELATED ఆమెకు మంచి రోజులొచ్చాయా?