సీఎం సోదరుడి వల్లనే ప్రభుత్వం పడిపోతోందా?

ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఉన్నా, ఆయన సోదరుడు రేవణ్ణ సూపర్ సీఎంగా వ్యవహరించాడనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేలు రేవణ్ణ విషయంలో అసహనంతో రగిలిపోయే రాజీనామాలకు పాల్పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాము చేస్తున్న రాజకీయ రచ్చకు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని వారికి తెలియనిది కాదు. ఎంత కోర్టుకు ఎక్కినా.. తమపై స్పీకర్ అనర్హత వేటు వేయగలరు!

అప్పుడు వారికి ఎమ్మెల్యే పదవి చేజారుతుంది. తమ తమ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. అనర్హత వేటు పడ్డాకా బీజేపీ తమను చేర్చుకుని గెలిపించుకుని ఉద్ధరిస్తుందని చెప్పడానికి గ్యారెంటీ ఏమీలేదు! ఇలాంటి నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలు తెగించి తిరుగుబాటు చేయడం గమనార్హం.

కర్ణాటక రాజకీయ రచ్చలో దేవేగౌడ కుమారుడు రేవణ్ణ తీరు కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆయన మంత్రులను, ఎమ్మెల్యేలనూ ఎవరినీ పని చేసుకోనిచ్చేవారు కాదని.. అందరి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ప్రభుత్వాన్ని కూల్చేయాలనే విరక్తిని నేతల్లో పుట్టించారనే ప్రచారం సాగుతూ ఉంది.

కాంగ్రెస్ సీనియర్లు  రామలింగారెడ్డి, సిద్ధరామయ్య లాంటి వాళ్లు కూడా సంకీర్ణ ప్రభుత్వంలో ఆనందంగా లేకపోవడంతో.. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చిందనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం కూలిపోయినంత మాత్రాన శాశ్వాతంగా అధికారం బీజేపీకి దక్కదని, ఎన్నికలు వస్తే మళ్లీ తమకు మంచి అవకాశాలు ఉంటాయని కర్ణాటక కాంగ్రెస్ నేతలు భావిస్తురనే మాట కూడా వినిపిస్తుండటం గమనార్హం!

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం

Show comments