నైజాంలో చైతన్య కొత్త రికార్డు

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కలెక్షన్లు దుమ్ము లేపుతోంది. ఆ రేంజ్ సినిమా ఆ విధంగా కలెక్షన్లు సాధిస్తోంది అంటే మరి అలాగే అనాలేమో? నాగా చైతన్య కెరీర్ లో హిట్ లు వున్నాయి, ఫ్లాపులు వున్నాయి. తండ్రి నాగ్ కాంబినేషన్ లో చేసిన మనం సినిమా నైజాంలో 11 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

అలాంటిది సోలోగా చేసిన రారండోయ్ వేడుక చూద్దాం ఇప్పటికే ఎనిమిది కోట్ల వరకు వసూలు చేసింది. ఇంకో వారం షేర్ వచ్చే సూచనలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే కచ్చితంగా టోటల్ బిజినెస్ క్లోజ్ అయ్యే సరికి 10 కోట్ల రేంజ్ కు వెళ్లేలా వుంది. ఎందుకంటే ఇప్పటికీ నైజాంలో నిత్యం 15 నుంచి 20 లక్షల షేర్ వస్తోంది.

నైజాంలో ఇటీవల విడుదలైన రాధ, కేశవ బిజినెస్ లు దాదాపు క్లోజ్ అయ్యాయి. కానీ ఏవీ మూడు కోట్లను దాటలేకపోయాయి. గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి భారీ సినిమా నైజాంలో సాధించిన వసూళ్లు పది కోట్లకు కాస్త తక్కువే. నాని నేను లోకల్ పదిన్నర కోట్లకు కాస్త అటుగా చేసింది. హిట్ అయిన నేను శైలజ నైజాంలో తెచ్చుకున్నది ఏడు కోట్లే.

ఈ లెక్కన ఇప్పటికే ఎనిమిది కోట్లు సాధించిన చైతన్య రారండోయ్ సినిమా ఈ వీకెండ్ ప్లస్ వీక్ లాంగ్ తరువాతకు మరో రెండు కోట్లు జోడించుకోగలిగితే అది చైతన్య కెరీర్ కు కొత్త రికార్డే అవుతుంది.

Show comments