చంద్రబాబును జైలుకు పంపాలన్న బీజేపీ నేత!

చంద్రబాబును జైలుకు పంపాలని వ్యాఖ్యానించారు భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం జమానాలో జరిగిన వివిధ వ్యవహారాలపై జగన్ ప్రభుత్వం విచారణలకు ఆదేశిస్తుంటే అడ్డుపుల్లలు వేస్తున్నారు కమలనాథులు.

రాజకీయంతో కూడుకున్న వ్యవహారాల సంగతెలా ఉన్నా.. రాష్ట్రానికే పెనుభారంగా మారుతున్న విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన వాటిని సమీక్షించడానికి బీజేపీ నేతలు ఒప్పుకోవడం లేదు. అలాంటి ప్రయత్నాలు వద్దంటూ ఢిల్లీ నుంచి వాళ్లు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

అవి రాష్ట్రానికి భారం అయినప్పటికీ ఈడ్చాల్సిందే తప్ప.. చంద్రబాబు విధానాలను సమీక్షించడానికి లేదని కమలనాథులు అంటున్నారు. ఇలాంటి క్రమంలో కన్నా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చంద్రబాబు నాయుడు మీద ఎన్నో ఆశలతో ప్రజలు ఎన్నుకున్నారని, ఆయన రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారని కన్నా అంటున్నారు. అలాంటి వ్యక్తిని జైలుకు పంపాలని ఆయన వ్యాఖ్యానించారు.

మరి ఈ విషయంలో కన్నా లక్ష్మినారాయణ తమ బీజేపీ పెద్దలకు చెబితేమేలేమో. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకున్నారని కూడా బీజేపీ నేతలు ఎన్నికల ముందు ఆరోపించారు. ఆ కథలేంటో తేల్చి.. కన్నా లక్ష్మినారాయణ చేస్తున్న డిమాండ్ ను నెరవేర్చే శక్తి కూడా ఇప్పుడు బీజేపీ పెద్దల చేతుల్లోనే కదా ఉన్నది!

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!

Related Stories: