‘కమ్మ’ ఆశ్రమం చేతిలో ఓడిన జేసీ!

తాడిపత్రి ప్రభోదానంద ఆశ్రమానికి, జేసీ దివాకర్ రెడ్డికి మధ్యన రచ్చ ఇప్పుడు పైకి ఎగసినా.. దీనివెనుక మాత్రం చాలా తతంగం ఉందని స్పష్టం అవుతోంది. ఈ ఆశ్రమంలో తనకు వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నాయనేదే జేసీ ప్రధానమైన అసహనంగా స్పష్టం అవుతోంది. రాయలసీమలో హైవేస్ మీద ప్రయాణించినా.. ప్రధానమైన రోడ్ల మీద వెళ్లినా.. పక్కన గోడల మీద ‘త్రైత సిద్ధాంత భగద్గీతను చదవండి’ అనే బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వందల చోట్ల ఈ రాతలు రాయబడి ఉంటాయి. ఈ త్రైత సిద్ధాంత భగద్గీత కర్తే ఈ ప్రభోదానంద స్వామి.

ఒక రకంగా చూస్తే హిందూ ధార్మిక సంస్థల్లో ఇదీ ఒకటి. ఇదొక ప్రత్యేక శిబిరం. అంతర్గతంగా దీనికి నెట్ వర్క్ బాగానే ఉంది. ఆస్తులు బాగున్నాయి. ఈ ప్రభోదానంద స్వామి అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి. చేసేది మతోద్ధరణ అయినా.. ఈయన కులంతో సంబంధాలు వదిలిపెట్టుకోలేదట. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు.. ప్రత్యేకించి కమ్మ సామాజికవర్గం నేతలతో సత్సంబంధాలు నెరుపుతూ ఉన్నారట ఈ పెద్దన్న చౌదరి తనయులు.

ఇప్పటి నుంచి కాదు.. ఈ ఆశ్రమం తాడిపత్రి సమీపంలో వెలిసినప్పటి నుంచి ఇవి కొనసాగుతూ ఉన్నాయని తెలుస్తోంది. తాడిపత్రిలో జేసీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే కమ్మ నేతలతో ఈ ఆశ్రమానికి సత్సంబంధాలున్నాయట. గతంలోనే పరిటాల, పయ్యావుల వంటి వాళ్లు ఈ ఆశ్రమంతో టచ్లో ఉండి.. జేసీకి చెక్ పెట్టే ప్రయత్నాలను ముమ్మరంగా సాగించేవారు. అయితే జేసీ టీడీపీలోకి చేరిపోవడంతో.. వారికి కమ్మ రాజకీయ నేతలు ఇటు వైపు యాక్టివిటీస్ తగ్గించారు.

ఇదే అదునుగా తీసుకున్నాడు జేసీ దివాకర్ రెడ్డి. ఈ ఆశ్రమం ఏనాటికైనా తనకు ప్రమాదకరం అని భావించాడు. అయితే పెద్దన్న చౌదరి కొడుకులు తెలుగుదేశం అండపోవడంతో.. బీజేపీ వైపు దూకారు. బీజేపీతో సత్సంబంధాలు మొదలుపెట్టారు. ఎలాగూ ఇలాంటి ఆశ్రమాలకు కమలం అండ ఉండనే ఉంటుంది. దీంతో ప్రభోదానంద ఆశ్రమానికి చెక్ చెప్పడం జేసీకి అంత సులువు కాలేదు.

ఈ నేపథ్యంలోనే.. వినాయకచవితి సందర్భంగా రచ్చను రాజేశారు. తనకు వ్యతిరేక శిబిరం అయిన ఈ ఆశ్రమాన్ని మొదటికే లేపేందుకు జేసీ ప్లాన్ వేసినట్టుగా ఉన్నాడు. అయితే అది అంత సక్సెస్ ఫుల్ కాలేదు! ఆశ్రమం నుంచి జేసీకి తీవ్రమైన ప్రతిఘటనే ఎదురైంది.

ఎంత కాదనుకున్నా.. ఆ ఆశ్రమం వాళ్లకు తెలుగుదేశం నేతలతో సంబంధాలున్నాయి కాబట్టి.. దీన్ని లేపేయడం జేసీకి సులభం కావడంలేదు. ఇది టీడీపీలో జేసీకి జరిగిన మరో ఘోర అవమానం!

Show comments