కశ్మీర్ పై కమల్ హాసన్ అనుచిత వ్యాఖ్యలు

ఒకవైపు కశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం విలయాన్ని సృష్టిస్తోంది. స్థానికుల్లోని కొందరు మత మౌడ్యులను ఉపయోగించుకుని పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఉగ్రవాదాలకు ట్రైనప్ ఇచ్చి ఐఎస్ఐ అక్కడ భారత సైన్యంపై తీవ్రమైన దాడులకు పాల్పడుతూ ఉంది. ఈ ఉగ్రమూకల విషయంలో ప్రపంచం తీవ్రంగా స్పందిస్తోంది. అయితే ఇండియాలో మాత్రం కొందరు మేధావులు తమ మేధస్సును చాటుకోవడానికి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వేర్పాటు వాదులకు వత్తాసు పలుకుతున్నారు ఈ మేధావులు.

వారిలో ఒకరిగా చేరాడు కమల్ హాసన్. ఇప్పుడు  రాజకీయం మొదలుపెట్టిన ఈ హీరో.. కశ్మీర్లో ప్రాజాభిప్రాయ సేకరణ చేయాలని దేశ సమగ్రతను దెబ్బతీసే పనికి భారతప్రభుత్వం పూనుకోవాలని చెప్పుకొచ్చాడు. సరిగ్గా వేర్పాటు వాదుల డిమాండ్ కూ కమల్ డిమాండ్ కూ పెద్ద తేడాలేదు.

కశ్మీర్ ను భారత్ లో అంతర్భాగంగా ఒప్పుకోవడం లేదు వేర్పాటు వాదులు. అక్కడ హింసను సృష్టించి.. కశ్మీర్ ను ఇండియా నుంచి వేరు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వేర్పాటువాదులకు విలువనిస్తూ పోస్తే.. దేశం ఎన్నిముక్కలు అవుతుందో, ఎన్ని వినాశనాలు జరుగుతాయో చెప్పనక్కర్లేదు.

అయితే కమల్ లాంటి మేధావులకు వాటితో అవసరం లేదు.. వీళ్ల మేధస్సు ఉగ్రవాదానికి కూడా మద్దతు పలుకుతూ ఉంటుంది. అందుకే కశ్మీర్ లో రెఫరండం అంటూ.. మాట్లాడాడు. అయితే ఆ వెంటనే డ్యామేజ్ కవరేజ్ ప్రయత్నాలు మొదలయ్యాయి. కమల్ ఏదో మాట్లాడితే మీడియా వక్రీకరించింది అంటూ ఆయన పార్టీ చెబుతోంది. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని వివరణ ఇచ్చుకుంది. అడుసు తొక్కనేలా.. కాలు కడగనేలా? 

ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!

అంతా అనైతికం, చెప్పేవి మాత్రం నీతులు