కాకినాడ వైకాపా టికెట్ అతనికే?

కాకినాడ ఎంపీ టికెట్ వైకాపా ఎవరికి ఇస్తుంది? చలమలశెట్టి సునీల్ గతంలో వైకాపా అభ్యర్థి అనుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు టీడీపీకి, వైకాపాకు మధ్యలో ఊగుతున్నారు. ఆయన టీడీపీలోకే వెళ్లారని వార్తలు వున్నాయి. మరి వైకాపా నుంచి ఎవరు? కాకినాడ లేదా ఈస్ట్ గోదావరిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అన్ని పార్టీలకు చాలామంది అభ్యర్థులు వున్నారు.

అందుకే వైకాపా తరపున బలిజ అశోక్ అనే పెద్దాయనను వైకాపా రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. రైల్వేలో ఉన్నతపదవిలో వున్న ఆయన చేత వీఆర్ఎస్ అప్లయ్ చేయించి రంగంలోకి దింపే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి, అప్పుడే తెలుగుదేశం పార్టీ అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. పోలీసుశాఖలో వుండే ఆయన బంధువును కీలక బాధ్యతల నుంచి తప్పించి, వేరే చొటికి బదిలీ చేసినట్లు రాజకీయ వర్గాల బోగట్టా.

ఇంత జరిగిన తరువాత, ఆయన వీఆర్ఎస్ అప్లయ్ చేసి వచ్చిన తరువాత ఆయనకు తప్ప వేరేవాళ్లకు ఇవ్వడం కుదరకపోవచ్చన్నది వైకాపా వర్గాల బోగట్టా. మరి ఇలాంటి నేపథ్యంలో చలమలశెట్టి సునీల్ వైకాపాలోకే వచ్చే అవకాశం వుందని వినిపిస్తోంది. వాస్తవానికి సునీల్ ఆర్థికంగా బలమైన వ్యక్తి. కానీ వైకాపా ఈ పరిస్థితుల్లో ఏం చేస్తుందన్నది క్వశ్చను.

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments