కెరీర్ కు కాజల్ ఫైనల్ టచ్ ఇస్తోందా!

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన చాలా మంది తమ కెరీర్ ఆఖర్లో చేసిన పని కన్నడ  సినిమాలు చేయడం!

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు తగ్గిపోయాకా, వాళ్లకు వయసు మీద పడ్డాకా,  ఇక్కడ భారీ సినిమాల్లో-పెద్ద సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాకా.. అప్పుడు కన్నడ సినిమాలకు వాళ్లు ఓకే చెబుతూ వచ్చారు.

దానికి ప్రధాన కారణం.. కన్నడ చిత్ర పరిశ్రమ పరిధి చిన్నది కావడం, అక్కడ  పారితోషికాలూ గట్రా తక్కువ కావడంతో కెరీర్ ఆరంభంలో చాలా మంది అక్కడ సినిమాలు చేయరు.

అయితే తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్లుగా అవకాశాలు తగ్గిపోయాకా మాత్రం వారు కన్నడ మీద కన్నేయడం జరుగుతూ వస్తోంది. ఎనభైల్లో, తొంభైల్లో చాలా మంది హీరోయిన్లు అలానే చేశారు.

ఇప్పుడు కూడా అందుకు మినహాయింపు ఉన్నట్టుగా లేదు. కాజల్ అగర్వాల్ కన్నడ సినిమాలకు ఓకే చెబుతోందట. ఉపేంద్ర సరసన ఒక సినిమాలో కాజల్ హీరోయిన్ గా సైన్ చేసిందని తెలుస్తోంది.

ప్రస్తుతం కాజల్ కు తెలుగు, తమిళాల్లో పెద్దగా అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. ఏజైన హీరోల సరసన మాత్రమే అవకాశాలున్నాయి.

ఉపేంద్ర కూడా అదే కేటగిరి హీరోనే. కన్నడలో కూడా  కాజల్ ను యంగ్ హీరోలు పట్టించుకునేలా లేరు. మొత్తానికి తన కెరీర్ లో తొలి సారి ఒక కన్నడ సినిమాలో నటిస్తోందట కాజల్.

చాలా మంది హీరోయిన్లుగా తమ  కెరీర్ చరమాంకంలో అక్కడ సినిమాలు చేశారు, అంటే కాజల్ కూడా ఆ స్టేజ్ కు చేరిందా?

Show comments