పాల్‌తో జీవిత‌కు రుణానుబంధ‌మా?

కేఏ పాల్ సామాన్యుడు కాదు. మ‌న‌దంతా ఇంట‌ర్నేష‌న‌ల్ థింకింగ్ అనే పాల్....హైద‌రాబాద్ లోక‌ల్ యాక్ట‌ర్ జీవితారాజ‌శేఖ‌ర్‌కు అప్పు ఇవ్వ‌డం ఏంటి? అందులోనూ ల‌క్షో, రెండు ల‌క్ష‌లో కాదు..ఏకంగా రూ.20 ల‌క్ష‌ల సొమ్ము.2017లో ఈ సొమ్మును ఆమెకు ఇచ్చాన‌ని అమెరికా నుంచి స్కైప్‌లో హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల‌తో మాట్లాడుతూ పాల్ చెప్పాడు. అంతేకాదు ఆ సొమ్మును ఇప్ప‌టికీ పూర్తిగా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న వాపోయాడు. కేవ‌లం ఒక‌ట్రెండు ల‌క్ష‌లు మాత్ర‌మే ఇచ్చిన‌ట్టు పాల్ తెలిపాడు.

ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మపై కోపం..చివ‌రికి ఎవ‌రెవ‌రిపైకో వెళ్లిపోతోంది.జీవితారాజ‌శేఖ‌ర్‌పై పాల్ మండిప‌డ‌డానికి కార‌ణం లేక‌పోలేదు.ఈ సినిమాపై ప‌లువురు హైకోర్టుకు వెళ్లారు. వారిలో పాల్ కూడా ఉన్నాడు. ఈ సినిమా చూసి నివేదిక ఇవ్వాల‌ని సెన్సార్‌బోర్డును హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు సెన్సార్‌బోర్డు స‌భ్యులు సినిమా చూశారు. విడుద‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

దీంతో సినిమా నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు క‌ల‌సి రివైజ‌నింగ్ క‌మిటీకి వెళ్లాడు. ఆ క‌మిటీ సినిమా చూసి కొన్ని సీన్ల‌ను క‌ట్‌చేసి విడుద‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది.ఈ క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్ జీవితారాజ‌శేఖ‌ర్‌. దీంతో పాల్‌కు చిర్రెత్తుకొచ్చింది. జీవితాకు తాను రూ.20 ల‌క్ష‌లు అప్పు ఇచ్చాన‌ని, ఇంత వ‌ర‌కూ ఆమె తిరిగి ఇవ్వ‌లేద‌ని ఆరోప‌ణ చేశాడు. పాల్ ఆరోప‌ణ‌ల‌పై జీవిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమా విడుద‌ల‌ను ఆపాల‌ని ప్ర‌జాశాంతి అధ్య‌క్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు.సెన్సార్ బోర్డు వైఖ‌రిని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.సినీ న‌టి జీవిత‌కు తాను 2017లో రూ.20 ల‌క్ష‌లు ఇచ్చాన‌ని,నేటికీ పూర్తిగా ఇవ్వ‌లేద‌న్నారు.రూ.2 ల‌క్ష‌లు,మూడు ల‌క్ష‌లు మాత్ర‌మే ఇచ్చింద‌న్నారు. 

Show comments