జాన్వీ కపూర్.. లేటెస్ట్ కవర్ పేజ్ స్టిల్!

బాలీవుడ్‌కు కొత్త ఫ్యాషన్ లేబుల్‌గా మారింది జాన్వీకపూర్. తొలి సినిమాకు ముందు నుంచినే ఆకట్టుకుంటూ వస్తున్న శ్రీదేవి తనయ ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారుతోంది. ‘ధడక్’తో తన ఫస్ట్ అప్పీరియన్స్‌తో ఆకట్టుకున్న ఈమెకు హిందీ చిత్ర పరిశ్రమలో మరి కొన్ని అవకాశాలు దక్కుతున్నాయి. ఈమె తొలి సినిమాను నిర్మించిన కరణ్ జొహార్ ఇప్పుడు ఈమె రెండో సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే జాన్వీ మూడో సినిమా కూడా కరణ్ బ్యానర్ మీదే ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

ఇక బయటి బ్యానర్లు కూడా జాన్వీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇలా కవర్ పేజీ మీద మెరిసింది జాన్వీ. ఈమె ఫొటో షూట్స్ కోసం, కవర్ పేజీల కోసం, ర్యాంప్ షోల కోసం చాలా బ్రాండ్స్ ఎదురుచూపుల్లో ఉన్నాయి. ఇలా ఫ్యాషన్ ట్రెండ్స్ వాళ్లకు జాన్వీ ఆకర్షణగా మారింది.

ఇదిలా ఉంటే జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ కావడానికి సమయం దగ్గరపడుతోందని తెలుస్తోంది. ఆమెను కూడా కరణ్ జొహార్ ఇంట్రడ్యూస్ చేయనున్నాడట. షారూక్ తనయుడు హీరోగా నటించే సినిమాతో ఖుషీ ఇంట్రడ్యూస్ కానుందని సమాచారం.