జెర్సీ ఓవర్ సీస్ @ 4.25

నాని-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా జెర్సీ. ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. నాని కెరీర్ లో ఓ మంచి సినిమా మిగులుతుందని టాలీవుడ్ జనాలు భావిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా థియేటర్ రైట్స్ మార్కెటింగ్ ప్రారంభమైంది. ఓవర్ సీస్ హక్కులను బ్లూ స్కై సంస్థ తీసుకుంది.

4.25 కోట్ల మినిమమ్ గ్యారంటీ అమౌంట్ కు ఓవర్ సీస్ హక్కులు ఇచ్చారు. అదే సమయంలో ఓవర్ సీస్ లో బయ్యర్ చేసే థర్డ్ పార్టీ బిజినెస్ మీద 10పర్సంట్ కమిషన్ నిర్మాతకు వుంటుంది. ఇదికాక ఓవర్ ఫ్లోస్ ఫిఫ్టీ.. ఫిఫ్టీగా పంచుకుంటారు.

ఓ విధంగా చెప్పాలంటే నిర్మాతకు మంచి డీల్ నే. నానికి ఓవర్ సీస్ వన్ మిలియన్ క్లబ్ లో నాలుగైదు సినిమాలు వున్నాయి. ఈ సినిమా బయ్యర్లకు లాభాలు రావాలంటే వన్ మిలియన్ దాటి చేయాల్సి వుంటుంది. బ్లూ స్కై సంస్థ ఇటీవలే ఎఫ్ 2తో ఓవర్ సీస్ లో భయంకరంగా లాభాలు ఆర్జించి హుషారు మీద వుంది.

జెర్సీ సినిమాలో నాని రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. అలాగే తండ్రీ కొడుకుల సెంటిమెంట్, క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా కథ వుంటుంది.

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?