జెర్సీకు క్లీన్ యు

నాని-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రెడీ అయిన జెర్సీ సినిమా సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ లేకుండా క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. సినిమా ముందు వచ్చే చట్టబద్ద ప్రకటనలు, చివర్న వచ్చే రోలింగ్ టైటిల్స్ అన్నీకలిపి రెండు గంటల నలభై నిమిషాల నిడివి వచ్చింది. అవన్నీ తీసేస్తే, రెండున్నర గంటల నిడివి వుంటుంది.

ఓ మధ్యతరగతి యువకుడి జీవితం, అతని కోరిక, కొడుకుతో అనుబంధం, కొడుకు దృష్టిలో హీరోగా నిలబడాలన్న తపన, ఇవన్నీ కలిసిన కథే జెర్సీ. ఈ సినిమాలో నాని ప్రథమార్థం అంతా యంగ్ స్టూడెంట్ గా, ఆపై లవర్ గా, తరువాత థర్టీ ప్లస్ మారీడ్ మన్ గా కనిపిస్తాడు. 

ద్వితీయార్థంలో క్రికెటర్ గా తనను తాను ఎలా సానపట్టుకున్నాడు, ఎలా రంజీ లెవెల్ కు చేరాడు అన్నది వుంటుంది. సినిమాలో క్రికెట్ ను రియల్ మ్యాచ్ ల మాదిరిగా చిత్రీకరించడం విశేషం. ఫైనల్ రంజీ మ్యాచ్ ను ఎల్ బి స్టేడియంలో ఫ్లడ్ లైట్ల మధ్య భారీ జనాల నడుమ రియలిస్టిక్ గా చిత్రీకరించారు. 

ఈ సినిమా 19న విడుదలవుతుంది. సినిమాకు సంగీతం అనిరుధ్, నిర్మాతలు నాగవంశీ, పిడివి ప్రసాద్.

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!

Show comments