జాన్వీ కొత్త కారు.. నెట్లో ట్రెండ్ అవుతూ ఉంది!

గత మూడు రోజులుగా నెట్ లో జాన్వీకపూర్ కొత్త కారు బాగా ట్రెండ్ అవుతూ ఉంది. సరిగ్గా మూడు సినిమాల్లో కూడా నటించని జాన్వీ ఏకంగా మూడు కోట్ల రూపాయల కొత్త కారు కొనడం పట్ల నెటిజన్లు 'వావ్వ్' అంటున్నారు.

నటిగా కొన్ని సినిమాలే చేసినా.. ఒక పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చిన జాన్వీ కపూర్ కు ఈ రేంజ్ కారు కొనడం కష్టం కాదేమో. ఈ హీరోయిన్ మూడు కోట్ల రూపాయల విలువ చేసే మెర్సిడేజ్-ఎస్ క్లాస్ సెడెన్ కారును కొనుగోలు చేసింది.

దీని ఎక్స్ షోరూం ప్రైజే మూడు కోట్ల రూపాయల వరకూ ఉంటుందని కార్ ఎక్స్ పర్ట్స్ చెబుతూ ఉన్నారు. ఇక ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ లో తల్లి సెంటిమెంట్ ను ఫాలో అవుతోందట జాన్వీకపూర్. మహారాష్ట్ర 02 రిజిస్ట్రేషన్ తో శ్రీదేవి 7666 నంబర్ ఉన్న కారును వాడేదట. ఇప్పుడు జాన్వీ కపూర్ కొత్త కారు కూడా అదే రాష్ట్ర 02 రిజిస్ట్రేషన్ తో వేరే సీరిస్ లోని 7666 నంబర్ తో రిజిస్ట్రేషన్ అయి ఉందని సమాచారం.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

Show comments

Related Stories :