జాను స్క్రిప్ట్ మళ్లీ మొదటికి?

సాహో సినిమా వ్యవహారం ముగిసింది. జనం ఇక ఇప్పుడు ప్రభాస్ తరువాత సినిమా ఏమిటి? అన్నదాని మీదకు తమ దృష్టి మళ్లించేసారు. కానీ అటు ప్రభాస్ కానీ, ఇటు యువి కానీ ఆ దిశగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. అన్నపూర్ణ సెట్ రెడీ గా వుంది. కానీ షూటింగ్ మాత్రం ప్రారంభం కావడం లేదు. సాహో కి ముందు కొంత వర్క్ అయితే చేసారు కానీ అదేమంత ఎక్కువ కాదు. 

నవంబర్ నుంచి మలి షెడ్యూలు మొదలవుతుంది అనుకున్నారు కానీ అలా జరగలేదు. డిసెంబర్ నుంచి అనుకున్నారు కానీ ఇప్పటికి ఆ సూచనలు కనిపించడం లేదు. ప్రభాస్ కూడా మళ్లీ మరోసారి విదేశాలకు వెళ్లారు. అంటే దగ్గరలో షూటింగ్ స్టార్ట్ కావడం లేదు అనుకోవాలి.

ఇలాంటి నేపథ్యంలో జాను స్క్రిప్ట్ ను మళ్లీ ఫైన్ ట్యూన్ చేస్తున్నారన్న గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈసారి ఎటువంటి పొరపాటు జరగకూడదని, స్క్రిప్ట్ ను పూల్ ఫ్రూఫ్ గా చేయడంతో పాటు, ఫైన్ ట్యూన్ చేస్తున్నారని టాక్. మరి ఇదే నిజమైతే, జాను సినిమా ఎప్పటికి మొదలవుతుందో? ఎప్పుడు మళ్లీ ప్రభాస్ సినిమా ఫ్యాన్స్ ముందుకు వస్తుందో?

Show comments