జనసేన- టీడీపీ.. పొత్తు పెట్టుకుంటే పోయేదిగా!

ఇంత లోపాయికారీ పొత్తులు ఎందుకు? ధైర్యంగా పొత్తుతో బరిలోకి దిగితే పోయేది కదా.. అని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల పోటీ విషయంలో జనసేన- టీడీపీలు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్న తీరును చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఒకవైపు పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న మాటలు, మరోవైపు అభ్యర్థుల విషయంలో వీరు పడుతున్న కథలు.. చూసి.. ఇలా ఒకర్నొరకరు సహకరించుకోవడానికి ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు, ఎంచక్కా ధైర్యంగా పొత్తు పెట్టుకుని, చెరి కొన్ని సీట్లను పంచుకుని ఉంటే సరిపోయేది కదా.. సామాన్యులు అంటున్నారు.

-లోకేష్ ను అవినీతి పరుడు అని కొన్నినెలల కిందట విమర్శించారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత ఆమాట ఎత్తడం లేదనుకోండి. ఇప్పుడేమో లోకేష్ మీద జనసేన అభ్యర్థి పోటీలోలేడు! అదేమంటే పొత్తుల్లో భాగంగా ఈ సీటును త్యాగం చేశారట! ఆ పార్టీకి ఇచ్చిందే ఏడు సీట్లు. వాటిల్లో లోకేష్ పోటీచేస్తున్న నియోజకవర్గాన్ని త్యాగం చేయడం దేనికి సంకేతం?

-గాజువాకలో పల్లా శ్రీనివాస్ గట్టి అభ్యర్థి అని స్పష్టం అవుతోంది. సామాజికవర్గ సమీకరణాలు అతడికి అనుకూలంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ అక్కడ నుంచి పోటీచేయాలని అనుకుంటున్న నేఫథ్యంలో.. పల్లాను అక్కడ నుంచి తప్పించడానికి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పవన్ కోసం ఇలా త్యాగం చేస్తున్నారు చంద్రబాబు!

-తెనాలిలో కూడా జనసేన అభ్యర్థి కోసం తెలుగుదేశం త్యాగానికి సిద్ధం అయ్యిందని, అయితే దానికి సిట్టింగులు నిరాకరించడంతో చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గాల్సి వచ్చిందని భోగట్టా. నిన్న రాత్రి చంద్రబాబు అందుకు సంబంధించి హడావుడి చేశారు. ఆ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా ధ్రువీకరించింది!

-భీమిలి విషయంలో ఇంత డ్రామా నడిపించింది చివరకు అక్కడ నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను పోటీ చేయించేందుకు అని తేలిపోతోంది. తెలుగుదేశం పార్టీలోకి చేరి అక్కడ నుంచి పోటీ  చేయాల్సిన లక్ష్మినారాయణ ఇప్పుడు జనసేన తరఫున అక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారట. భీమిలి నుంచి డమ్మీ కోసం చంద్రబాబు నాయుడు అన్వేషిస్తూ ఉన్నారట!

-ఇక పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తెలుగుదేశం వాళ్లను అన్నిమాటలు అన్నా.. ఇప్పుడు నరసాపురం నుంచి ఎంపీగా పోటీచేసేందుకు తెలుగుదేశం పార్టీ సహకారం అందిస్తోందని సమాచారం. జనసేన తరఫున నాగబాబు బరిలోకి దిగనున్న నేపథ్యంలో, నిన్నటివరకూ అక్కడ టీడీపీ తరఫున ప్రచారం చేసిన చైతన్యరాజును పక్కన పెట్టేశారట, ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజును అక్కడ నుంచి పోటీచేయించి.. నాగబాబుకు ఇబ్బందిలేకుండా చూసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది.

-ఇవన్నీ కొన్నినెలల కిందట నుంచినే వేసిన ఎత్తుగడలు అని తెలుస్తోంది. లోలోన మంత్రాంగం జరిపి ఇప్పుడు అమల్లోకి తీసుకువస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

-మరి ఈ మాత్రం దానికి జనసేన- టీడీపీలు వేర్వేరుగా ఎందుకు పోటీ చేయాలంటే.. దానికీ పలు రీజన్లున్నాయి. కాపులు ఈసారి చంద్రబాబుకు అనుకూలంగా లేరు. పవన్ వెళ్లి బాబుతో పొత్తు పెట్టుకున్నా కాపుల్లో చాలా ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తాయి. అది జరగకూడదు. అందుకే పవన్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిందని అంటున్నారు.

-ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం, తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఎంతో కొంత ఓటు శాతాన్ని తగ్గించడం అనే చంద్రబాబు నాయుడు వ్యూహానికి అనుగుణంగానే పవన్ కల్యాణ్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో తన పాత్రను పోషిస్తోందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments