జనసేన దిగుంటే.. కారు కింద క్రష్ అయ్యేది!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి జగన్ ఏనాడూ మాట్లాడలేదు. తెలంగాణలో తన పార్టీ నేతలతో సమీక్షలు సమావేశాలు కూడా ఆపేసి చాలా కాలం అయ్యింది. ఏపీలో పొడిస్తే చాలని జగన్ అక్కడ పని చేసుకొంటూ ఉన్నాడు.  ఈ సారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు జగన్ ఆ ఊసే ఎత్తలేదు. అయితే మొదట్లో బీరాలు పలకడం ఆ తర్వాత చేతులు ఎత్తేయడం అలవాటు అయిన పవన్ కల్యాణ్ మాత్రం తెలంగాణలో పోటీ అని మొదట ప్రకటించాడు.

ఇప్పుడు కాదు.. గత ఎన్నికలు కాగానే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. కేసీఆర్ తాట తీస్తానని హెచ్చరించిన రోజుల్లో పవన్ జీహెచ్ఎంసీలో పోటీ చేస్తానని ప్రకటించాడు. ఆ మాట నిలుపుకోలేదు అనుకోండి. ఆ తర్వాత అజ్ఞాతవాసి టైమ్ కు పవన్ కల్యాణ్ కేసీఆర్ ఫ్యాన్ అయిపోయాడు. ఆ అవసరానికి వెళ్లి కేసీఆర్ నుకలిశాడు కూడా. అయినా పవన్ ను కేసీఆర్ పట్టించుకోలేదు.

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాత్రం పవన్ ప్రకటించాడు. తన పార్టీ తెలంగాణలో పోటీ ఉంటుందని ప్రకటించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి చర్చలు చేపట్టినట్టుగా పేర్కొన్నాడు. ఈ విషయంలో సీపీఎం వాళ్లు పవన్ మీద ఆశలతో కనిపించారు కూడా. పవన్ తో కలిసి తాము బరిలోకి దిగుతామని వారు ప్రకటించారు. పవన్ కల్యాణ్ మొత్తం నలభై నియోజకవర్గాలను సెలెక్ట్ చేసినట్టుగా తెలిపాడు. అన్ని చోట్ల కాదు కానీ…జనసేన నలభై చోట్ల పోటీ చేస్తుందని పవన్ మొదట ప్రకటించాడు. కొన్ని రోజులు ఆ చర్చలు జరిగాయి.

ఆ తర్వాతేమో పవన్ చేతులెత్తేశాడు. రేపటి నుంచి నామినేషన్లు అనే సమయంలో జనసేన నుంచి ప్రకటన వచ్చింది.. తాము తెలంగాణ ఎన్నికల బరిలో నిలవడం లేదు! అని. మరి అంత వరకూ పోటీ చేయడం గురించి ఆలోచించినట్టుగా కలరింగ్ ఇచ్చారు.

ఒకవేళ పవన్ ముందుగా ప్రకటించినట్టుగా పోటీలో నిలిచి ఉంటే, నలభై సీట్లలో అయినా పోటీలో నిలిచి ఉంటే? పరిస్థితి ఏమిటి? అని! కాంగ్రెస్ హస్తం, చంద్రబాబు నాయుడి సైకిలే కారు కింద పడి నలిగి పోయాయి. దేనికీ పనికిరానట్టుగా తయారు అయ్యాయి. అలాంటిది గుర్తే లేని జనసేన ఏదో ఒక గుర్తుతో తెలంగాణలో పోటీ చేసి ఉంటే.. ఏ రేంజ్ లో క్రష్ అయ్యేదో! అయినా రేపటి లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని ఇటీవలే చెప్పాడు కదా.. చూద్దాం అప్పుడైనా దిగుతారేమో!

Show comments