మహేశ్ సినిమా నుంచి ఎగ్జిట్ః స్పందించిన జగపతి!

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి తను తప్పుకున్నట్టుగా వచ్చిన వార్తలపై మూడే ముక్కల్లో స్పందించాడు నటుడు జగపతి బాబు. ఆ సినిమా నుంచి తను ఎగ్జిట్ కావడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని అందుకే తను స్పందించినట్టుగా జగపతి చెప్పాడు. తన ముప్పై మూడేళ్ల కెరీర్ లో ఇలా వివరణ ఇచ్చుకోవడం ఇదే మొదటిసారని జగపతి అన్నారు.

అయితే తనకు ఆ క్యారెక్టర్ నచ్చక తప్పుకున్నట్టుగా వచ్చిన వార్తలు మాత్రం అబద్ధమని అన్నాడాయన. ఆ  పాత్ర తనకు చాలా నచ్చిందని, అయితే కొన్ని కారణాల వల్ల మాత్రమే తప్పుకున్నట్టుగా జగపతి చెప్పుకొచ్చారు. మహేశ్ బాబుతో తనకు విబేధాలు అబద్ధమని చెప్పిన జగపతి తను ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి రీజన్లేమిటో చెప్పలేదు.

ఆ పాత్ర కోసమే తను రెండు సినిమాలను వదులుకున్నట్టుగా కూడా జగపతి చెప్పుకొచ్చారు. పరిశ్రమలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయని, ఇది కూడా అలాంటిదే అంటూ.. తను ఆ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నట్టో సూటిగా చెప్పలేదు జగపతి బాబు!

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా