జగన్ కీలక సమావేశం.. ఎమ్మెల్యేల్లో టెన్షన్

ఎమ్మెల్యేలంతా ఎన్నాళ్లగానో వేసి చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరుకాబోతున్నారు. నేతలంతా ఈ సమావేశం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మీటింగ్ లో మంత్రి పదవులపై జగన్ కీలక ప్రకటన చేయబోతున్నారు. అదే నేతల టెన్షన్ కు ప్రధాన కారణం.

మంత్రి పదవులపై ఇప్పటికే కొందరికి క్లారిటీ వచ్చేసింది. వాళ్లంతా సంతోషంగానే ఉన్నారు. కానీ చాలా మంత్రి పదవులపై ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు సమావేశంలో ఆ స్పష్టత ఇవ్వబోతున్నారు జగన్. ఎవరెవరు మంత్రులు కాబోతున్నారనే అంశంతో పాటు.. ఎవరికి ఏ పోర్టుపోలియో ఇస్తున్నామనే విషయాన్ని కూడా జగన్ ఇవాళ్టి సమావేశంలోనే ప్రకటించబోతున్నారు.

జగన్ మంత్రులుగా ప్రకటించిన అభ్యర్థులంతా రేపు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి, 10వ తేదీన తొలి కేబినెట్ మీటింగ్ ఏర్పాటుచేయాలని జగన్ నిర్ణయించారు. ఇక అక్కడ్నుంచి పాలనను పరుగులుపెట్టించాలనేది జగన్ కోరిక.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తానని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, వాళ్లకు మంత్రి పదవులు దక్కడం గ్యారెంటీ. వాళ్లలో ఒకరు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. వీళ్లను పక్కనపెడితే.. సీనియర్లు, జూనియర్లలో ఎంతమందికి మంత్రి పదవులు దక్కుతాయి.. జిల్లాల వారీగా ఎంతమంది ఎమ్మెల్యేలు బెర్తులు ఖాయం చేసుకుంటారనే ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది.

6 నెలలు కాదు.. 6 రోజుల్లోనే దూకుడు