బాబు చెప్పడు, ఆయన పార్టనర్ అస్సలు చెప్పడు

ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్ని యూటర్న్ లు తీసుకున్నారో అందరికీ తెలుసు. ఈ అంశంపై ఆయన నాలుగు ఎన్ని మడతలు పడింతో ఇప్పటికే చూశాం. బాబుకు స్పెషల్ స్టేటస్ పై అస్సలు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి మరో ఉదాహరణ చూపించారు జగన్.

"ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని ఏ ముఖ్యమంత్రి అయినా ప్రకటిస్తే దాన్ని ఎవరైనా స్వాగతించాలి. అభివృద్ధి కోరుకునే వాళ్లు ఎవరైనా కృతజ్ఞతలు చెబుతారు. కానీ ఇక్కడ రివర్స్ లో జరుగుతోంది. కేసీఆర్ అనే వ్యక్తి పబ్లిక్ గా ప్రత్యేక హోదాకు మద్దతిచ్చినా కూడా ఆయన్ను చంద్రబాబు దొంగ అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు ఇష్టంలేదు కాబట్టి."

ప్రత్యేక హోదా కంటే రాజకీయాలే చంద్రబాబుకు ముఖ్యమని, అందుకే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా మద్దతిచ్చినా కనీసం కృతజ్ఞత చెప్పలేదని విమర్శించారు జగన్. కనీసం తను అద్దెకు తెచ్చుకుంటున్న ఇతర రాష్ట్రాల నేతలతో కూడా స్పెషల్ స్టేటస్ పై ప్రకటన చేయించలేకపోయారని ఎద్దేవా చేశారు.

"ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు ఈమధ్య చాలామంది ఇతర రాష్ట్రాల నాయకుల్ని అద్దెకు తీసుకొచ్చాడు. వాళ్లతో ర్యాలీలు చేయిస్తున్నాడు. ప్రత్యేక హోదాకు మద్దతిచ్చేలా అద్దెకు తీసుకొచ్చిన ఒక్క నాయకుడితో కూడా చంద్రబాబు ప్రకటన చేయించలేకపోయాడు. కనీసం ఒక్కరితో కూడా ప్రకటన ఇప్పించలేకపోయాడు. అదే కేసీఆర్ ముందుకొచ్చి ప్రత్యేక హోదా కోసం అండగా ఉంటామని స్టేట్ మెంట్ ఇస్తే కనీసం స్వాగతించ లేదు. ఒక్కడైనా కృతజ్ఞత చెప్పుతాడేమో అని ఇప్పటివరకు వెయిట్ చేశాను. చంద్రబాబు చెప్పడు, ఆయన పార్టనర్ అంతకంటే చెప్పడు."

తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన జగన్, పవన్ తనపై చేసిన విమర్శలపై కూడా స్పందించారు. తను తిరుమలలో చెప్పులతో నడవలేదని స్పష్టంచేసిన జగన్.. పవనే చెప్పులతో మెట్లు ఎక్కారని ఆరోపించారు. చంద్రబాబు పార్టనర్ (పవన్) నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. నేను తిరుపతికి చెప్పులు వేసుకొని పోయానట. ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నారో ఆలోచించండి. ఇదే తిరుమలకు నేను కాలినడకన 3 వేల 5 వందల మెట్లు ఎక్కి దర్శనం చేసుకున్నాను. ఇదే పార్టనర్ బూట్లతో మెట్లు ఎక్కారు. వీళ్లు నా గురించి మాట్లాడుతున్నారు.

ఈ 2 రోజుల్లో చంద్రబాబు అండ్ కో మరిన్ని కుతంత్రాలు చేస్తుందని, బాబు అనుకూల మీడియాలో ఉన్నది లేనట్టుగా చూపిస్తారని తెలిపిన జగన్.. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అనుకూల మీడియా రిలీజ్ చేస్తున్న దొంగ వీడియోలు, ఫొటోల్ని నమ్మొద్దని విజ్ఞప్తిచేశారు.

Show comments