ఇడుపులపాయ టు ఇచ్చాపురం.. కొత్త చరిత్ర!

ఎక్కుపెట్టిన గన్ ఆకారంలో ఉండే ఏపీకి ఒక మూలనున్న ఇడుపులపాయ నుంచి ఒక కెరటం బయల్దేరింది... ఆ కెరటం అందరినీ కలుపుకుంటూ.. జనకెరటంగా మారి.. పద్నాలుగు నెలల పాటు సాగి.. ఒక జనసునామీగా మారి.. ఇప్పుడు మరో తీరాన్ని తాకుతోంది! ఇడుపులపాయ నుంచి మొదలైన ఆ జనకెరటం.. ఇచ్ఛాపురాన్ని అందుకుంటోంది. జగన్ పాదయాత్ర తుది గమ్యాన్ని చేరుకుంటోంది. ప్రజాసంకల్పయాత్ర ఆఖరి మెట్టు వద్దకు వచ్చేసింది!

జనం.. జనం.. జనం.. ఇదేమాట. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ! ప్రాంతం లేదు, కుల-మత విభజన లేదు, నియోజకవర్గాల తేడా లేదు, జిల్లాల ప్రాతిపదికా లేదు! మూడువేల ఆరువందల కిలోమీటర్ల దూరం పాటు ఒక కిక్కిరిసిన మానవహారం ఏర్పడితే ఎలా ఉంటుందో.. ఒక్కసారి ఊహించుకుంటే ఎలా ఉంటుందో జగన్ పాదయాత్ర ఆద్యంతం అలానే ఉంటుంది!

రోజులు మారాయి.. కేలండర్లో నెలల మారాయి.. కాలాలు మారాయి... వెళ్లిన రుతువులే మాళ్లీ వచ్చాయి.. జగన్ పాదయాత్ర సాగుతూనే వచ్చింది. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా జగన్ ఇప్పుడు పాదయాత్ర లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. పాదయాత్రను ముగిస్తూ కొత్త యాత్రను చేపట్టబోతున్నాడు.

ఈ పాదయాత్రతో జగన్ కోట్లమంది ప్రజలకు చేరువయ్యాడు. తన గురించి గత ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారాలు ఏమిటో.. వాస్తవంగా తను ఏమిటో.. ప్రజలకు వివరించుకోవడానికి జగన్ కు పాదయాత్ర అద్బుత అవకాశంగా నిలిచింది.

సుదీర్ఘకాలం పాటు ప్రజల మధ్యన అది కూడా అనునిత్యం కొన్నివేల మధ్యన సాగుతూ కూడా ఎక్కడైనా జగన్ చిరు కోపాన్నో, కాసింత అసహనాన్నో చూపిస్తాడేమో దాన్ని భూతద్దం చూపిద్దానికి వ్యతిరేక మీడియా వేచి చూసింది.

వేల కిలోమీటర్ల యాత్ర.. వందరోజుల పాటు సాగినా.. ఎక్కడా ఆ మీడియాకు కూడా అలాంటి అవకాశం దక్కలేదు! జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందనను చూపించకపోవడం మినహా.. మరింకేం చేయలేకపోయాయి ప్రత్యర్తి మీడియా వర్గాలు.

సరిగ్గా వైఎస్ పాదయాత్ర కూడా ఇచ్ఛాపురంలోనే ముగిసింది. పాదయాత్ర ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికలతో వైఎస్ ముఖ్యమంత్రిగా పట్టాబిషిక్తుడయ్యాడు. జగన్ పాదయాత్రకు కూడా పరిపూర్ణత లభించేది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే!

రాష్ట్ర రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా పాదయాత్ర చేసినవారు దాన్ని సాధించుకుని తీరారు. జగన్ కు కూడా ప్రస్తుతానికి ఆ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మిగతా కథను కాలమే తేల్చాలి! అది కూడా ఇంకో నాలుగు నెలల్లో!

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!

Show comments