అదే పని జగన్ చేస్తే చంద్రబాబు పరిస్థితేంటి?

గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించేంత మెజారిటీ సంపాదించుకుంది టీడీపీ. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనే కుతంత్రంలో ఆ పార్టీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేల్ని తమవైపు లాక్కున్నారు చంద్రబాబు. పదవులు, డబ్బు, కాంట్రాక్టుల ఆశచూపి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు.

సరిగ్గా ఐదేళ్లు గడిచాయి. టీడీపీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆ పార్టీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఫ్యాన్ గాలి ముందు సైకిల్ కొట్టుకుపోయింది. మరి అప్పుడు చంద్రబాబు చేసిన పనిని, ఇప్పుడు జగన్ మొదలుపెడితే ఎలా ఉంటుంది?

ఇప్పటికిప్పుడు జగన్ తలుచుకుంటే టీడీపీని ఖాళీ చేయగలరు. చంద్రబాబు, బాలకృష్ణ మినహా అందర్నీ తనవైపు లాక్కోగలరు. అంతే కాదు, జగన్ పిలుపు కోసం చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తున్నారు కూడా. అప్పుడు టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్షహోదా కూడా ఉండదు. కానీ జగన్ ఆ పనిచేయరు.

రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, నూతన రాజకీయాల్ని ప్రారంభిస్తానని, తన ఎన్నికల ప్రచార సభల్లో ఎప్పటికప్పుడు చెబుతూవచ్చారు జగన్. ఇప్పుడు అదే మాట మీద నిలబడ్డారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనిని జగన్ రిపీట్ చేయదలుచుకోలేదు. జగన్-బాబు మధ్య ప్రధానమైన తేడా కూడా ఇదే.

మరోవైపు సోషల్ మీడియాలో ఈ 23 నంబర్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబాబును ఈ సంఖ్య ముంచేసిందని చెప్పుకుంటున్నారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని చంద్రబాబు గతంలో కొన్నారు. ఇప్పుడు బాబుకు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23. అంతేకాదు, ఫలితాలు వెలువడిన తేదీ కూడా 23. ఇలా చంద్రబాబును 23 అనే సంఖ్య పూర్తిగా ముంచేసిందని చెబుతున్నారు.

సినిమా రివ్యూ: సీత